Abn logo
Oct 18 2021 @ 22:03PM

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు

వైఎస్సార్‌ ఆసరా చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే ఆనం

బాలాయపల్లి, అక్టోబరు 18: రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూడూరు భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వాన పార్వతి, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దారు నౌషద్‌అహ్మద్‌, ఏసీ మురళి ఏపీఎం కిరణ్‌, సర్పంచులు దట్టం అంజలి, మన్నెమాల గోపీకృష్ణారెడ్డి, ఎంపీటీ సభ్యులు సురేంద్రరెడ్డి, మురళీరెడ్డి, రాయి దేవికా చౌదరి తదితరులు పాల్గొన్నారు.