రామమందిర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2021-01-19T05:41:13+05:30 IST

అయోధ్య రామమందిరం నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. రామమందిరం నిర్మాణనికి నిధి సమర్పణలో భాగంగా సోమవారం తిరుపతిపాలేం, కమ్మసిగడాం గ్రామాల్లో పర్యటించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించారు.

రామమందిర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి
విరాళాలు సేకరిస్తున్న ఎన్‌ఈఆర్‌

రణస్థలం: అయోధ్య రామమందిరం నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. రామమందిరం నిర్మాణనికి నిధి సమర్పణలో భాగంగా సోమవారం తిరుపతిపాలేం, కమ్మసిగడాం గ్రామాల్లో పర్యటించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ విరాళాలు అందజేయాలని  కోరారు.   కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్‌ ధర్మప్రసార సహాప్రముఖ్‌ పొగిరి సూర్యనారాయణ, శేషగిరిరావు, ఆకుల రవి, వేలిచేటి వేణు, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.  ఎచ్చెర్ల: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నిధులు సేకరిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం తెలిపారు.   కుశాలపురం పంచాయతీ పారిశ్రామిక వాడలో సోమవారం  విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సంపతిరావు నాగేశ్వరరావు, తమ్మినేని గోవిందరావు, వావిలపల్లి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జి.సిగడాం: పున్నాం, బూటుపేట, ముసినివలస తదితర గ్రామాలలో రామాలయ నిర్మాణానికి విరాళాలు సేకరించారు.    ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచాలక్‌ వజ్జపర్తి రఘురాం,  మీసాల రామకృష్ణ భాస్కరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస రూరల్‌ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సాయాన్ని అందించాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాతిన గడ్డెయ్య అన్నారు. సోమవారం తమ్మయ్యపేటలో సమర్పణ అభియాన్‌ నిధి సేకరణలో ఆయన పాల్గొన్నారు. వంజంగిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కోశాధికారి పేడాడ సూరపునాయుడు పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-19T05:41:13+05:30 IST