IPL 2022: ‘ఇదేం పని Krunal.. ఇంత అతి పనికిరాదు’.. ఇంత సీరియస్‌గా స్పందించింది ఎవరంటే..

ABN , First Publish Date - 2022-04-25T23:35:51+05:30 IST

IPLలో భాగంగా ఆదివారం నాడు Mumbai Indians, Lucknow Super Giants జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వాంఖడే స్టేడియం సాక్షిగా ఓ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అదేంటంటే..

IPL 2022: ‘ఇదేం పని Krunal.. ఇంత అతి పనికిరాదు’.. ఇంత సీరియస్‌గా స్పందించింది ఎవరంటే..

IPLలో భాగంగా ఆదివారం నాడు Mumbai Indians, Lucknow Super Giants జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వాంఖడే స్టేడియం సాక్షిగా ఓ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అదేంటంటే.. ఛేజింగ్‌కు దిగిన ముంబై బ్యాటింగ్ ఆడుతోంది. 20వ ఓవర్‌లో తొలి బంతికి Krunal Pandya బౌలింగ్‌లో Pollard షాట్‌కు యత్నించి క్యాచ్‌గా దొరికిపోయాడు. నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్న Pollardను ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి ‘హగ్’ చేసుకున్నాడు. అతనెవరో కాదు లక్నో బౌలర్ క్రూనల్ పాండ్యానే. Pollard ఔట్ అయి డ్రెస్సింగ్ రూంకు వెళ్లిపోతున్న సందర్భంలో క్రూనల్ పాండ్యా Pollardను సమీపించి ఎగురుకుంటూ వెళ్లి అతనిని వెనుక నుంచి ఆలింగనం చేసుకున్నాడు. ‘కాస్తోకూస్తో నీ మీదే ఆశలు పెట్టుకున్నారు.. అలాంటి నువ్వు కూడా పేలవంగా ఆడి ఔట్ అయి వెళ్లిపోతున్నందుకు థ్యాంక్స్’ అన్నట్టుగా Krunal తీరు ఉండటం గమనార్హం. Krunal చర్యపై Pollard ఏమాత్రం స్పందించలేదు. కోపగించుకునే పరిస్థితి అసలే ఉండదు.


ఎందుకంటే.. Pollard, Krunal అంత మంచి ఫ్రెండ్స్. Mumbai Indians టీంలో ఇద్దరూ కలిసి ఆడిన వాళ్లే. వీరి స్నేహం గురించి Mumbai Fansకు తెలియందేం కాదు. కానీ.. ఎంత తెలిసినప్పటికీ పుండు మీద కారం చల్లినట్టుగా మౌనంగా వెళ్లిపోతున్న Pollardను ఇబ్బంది పెట్టేలా క్రూనల్ చేసిన పనికి ముంబై ఫ్యాన్స్ రుసరుసలాడుతున్నారు. టీవీల్లో లైవ్ మ్యాచ్ చూస్తున్న వారు కూడా క్రూనల్ తీరుకు ఆశ్చర్యపోయారు. కామెంటేటర్స్, స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్ కూడా క్రూనర్ ప్రవర్తనపై పెదవి విరిచారు. టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. Kieron Pollardకు క్రూనల్ పాండ్యా ఈ తీరులో Send Off ఇవ్వడం సరికాదని పార్థివ్ అభిప్రాయపడ్డాడు. క్రూనల్, పొలార్డ్ ఎంతో మంచి స్నేహితులని, వారి స్నేహాన్ని తప్పుబట్టడం లేదు కానీ మైదానంలో ఉండే పరిస్థితులు వేరని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ ఆడుతున్న సమయంలో చెప్పుకోతగ్గ పరుగులు చేయలేదని.. దాంతో పాటు ముంబై ఓటమి అంచుల్లో ఉందని చెప్పాడు. అలాంటి సమయంలో.. వ్యక్తుల స్వేచ్ఛకు విలువ ఇవ్వడం ఎంతో ముఖ్యమని Parthiv Patel వ్యాఖ్యానించాడు.


కావాలంటే డ్రెస్సింగ్ రూంలో ఉన్న సమయంలో ఈ సంవత్సరం అంతా Pollardను క్రూనల్ పరిహాసమాడొచ్చని.. కానీ క్రూనల్ స్పందించిన తీరు మాత్రం హద్దులు దాటిందనేది తన అభిప్రాయమని Parthiv Patel చెప్పుకొచ్చాడు. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్‌పీ సింగ్ (RP Singh) కూడా ఈ తరహాలోనే స్పందించాడు. ఓడిపోవాలని ఎవరూ కోరుకోరని, ఒక ఆటగాడు సరైన ఆట తీరును కనబర్చని సందర్భంలో ఈ తరహా చర్యలు సరికాదని.. నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోతున్న ఆ వ్యక్తిలో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో తనకు తెలియదని క్రూనల్‌ను ఉద్దేశించి RP Singh వ్యాఖ్యానించాడు. ఒకవేళ.. క్రూనల్ తీరుకు నొచ్చుకుని పొలార్డ్ వెనక్కి తిరిగి స్పందించి ఉంటే పరిస్థితి ఏంటని RP Singh ప్రశ్నించాడు. తన జట్టు మ్యాచ్‌లు గెలవలేకపోతోందనే నిరాశలో పొలార్డ్ ఉన్నాడని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న అతను ఔట్ అయిన బాధలో వెళ్లిపోతుంటే Krunal ప్రవర్తించిన తీరు మాత్రం చాలా అతిగా ఉందని RP Singh చెప్పాడు. IPLలో భాగంగా ఆదివారం నాడు Lucknow Super Giantsతో జరిగిన మ్యాచ్‌లో Mumbai Indians జట్టు ఓటమి పాలైంది. ఈ IPL సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని Mumbai Indians జట్టుకు ఇది వరుసగా ఎనిమిదో ఓటమి.

Updated Date - 2022-04-25T23:35:51+05:30 IST