రంగులేసి డప్పుకొట్టుకోండి: పంచుమర్తి

ABN , First Publish Date - 2020-02-22T09:54:56+05:30 IST

సజ్జల రెడ్డిగారూ, దొంగ లెక్కల వీసారెడ్డి స్కూల్‌లో శిక్షణ పొం దినట్టున్నారు. వెలిగొండ తొలి సొరంగం 18.84 కిలోమీటర్లకి 17 కిలోమీటర్లు చంద్రబాబే పూర్తి చేశారు. మిగిలిన 1.84 కిలోమీటర్లు పూర్తి చేయకుండానే

రంగులేసి డప్పుకొట్టుకోండి: పంచుమర్తి

‘‘సజ్జల రెడ్డిగారూ, దొంగ లెక్కల వీసారెడ్డి స్కూల్‌లో శిక్షణ పొం దినట్టున్నారు. వెలిగొండ తొలి సొరంగం 18.84 కిలోమీటర్లకి 17 కిలోమీటర్లు చంద్రబాబే పూర్తి చేశారు. మిగిలిన 1.84 కిలోమీటర్లు పూర్తి చేయకుండానే తప్పుడు లెక్కలు చెబుతున్నారు’’ అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ట్వీట్‌ చేశారు. ‘‘మీకు కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదని తేలింది. చంద్రబాబు చేసిన అభివృద్ధికి వైసీపీ రంగులేయడం, పేర్లు మా ర్చడం తెలిసిన జగన్‌తో సొరంగానికీ రంగులేసి డప్పుకొట్టుకోండి’’ అన్నారు. 

Updated Date - 2020-02-22T09:54:56+05:30 IST