Osmania Universityలో పార్ట్‌టైం పీజీ

ABN , First Publish Date - 2022-07-06T20:42:03+05:30 IST

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (యూసీఈ) - పార్ట్‌ టైం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Osmania Universityలో పార్ట్‌టైం పీజీ

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (యూసీఈ) - పార్ట్‌ టైం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, బయో మెడికల్‌, మైనింగ్‌ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఇంజనీరింగ్‌ విభాగంలో 85 శాతం సీట్లను స్థానికులకు ప్రత్యేకించారు. మిగిలిన సీట్లకు ఆసక్తిగలవారందరూ (లోకల్‌, నాన్‌ లోకల్‌ అభ్యర్థులు) పోటీ పడవచ్చు. 


విభాగాలు - స్పెషలైజేషన్‌లు - సీట్లు

  • సివిల్‌ ఇంజనీరింగ్‌: స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ 20, జియో టెక్నికల్‌ ఇంజనీరింగ్‌ 15, వాటర్‌ రిసోర్స్‌ ఇంజనీరింగ్‌ 15, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌ 15 సీట్లు ఉన్నాయి.  
  • కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 30, పార్లెల్‌ డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్‌ 15, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ 15 సీట్లు ఉన్నాయి
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌: ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, ఆటొమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజనీరింగ్‌, టర్బో మెషినరీ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి.
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌: ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌, పవర్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌, పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌ సిస్టమ్స్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి. 
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌: డిజిటల్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌, సిస్టమ్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, మైక్రోవేవ్‌ అండ్‌ రాడార్‌ ఇంజనీరింగ్‌, వీఎల్‌  ఎస్‌ఐ అండ్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి. 
  • బయో మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ లో 15, మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో 15 సీట్లు ఉన్నాయి. 


అర్హత

  • స్పెషలైజేషన్‌ను అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణులై ఉండాలి. జూన్‌ 30 నాటికి కనీసం ఏడాది అనుభవం ఉండాలి.   
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి ఏదేని ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు; మాస్టర్స్‌ డిగ్రీ(ఫిజిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ మేథమెటిక్స్‌/ అప్లయిడ్‌ మేథమెటిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ ఫిజిక్స్‌/ జియో ఫిజిక్స్‌) పూర్తిచేసినవారు; ఎమ్మెస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌) ఉత్తీర్ణులు; ఎంసీఏ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి(బీఈ/బీటెక్‌)(బయో మెడికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/ ఈఐఈ/ ఈసీఈ/ బయోటెక్నాలజీ/ మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ ) ఉత్తీర్ణులు; ఎమ్మెస్సీ(ఎలకా్ట్రనిక్స్‌/ మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ / అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ / ఫిజిక్స్‌/ మెడికల్‌ ఫిజిక్స్‌/ బయో ఫిజిక్స్‌/ బయో ఇన్ఫర్మాటిక్స్‌/ బయో మెడికల్‌ ఇన్ఫర్మాటిక్స్‌/బయోటెక్నాలజీ) పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. 
  • మైనింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి మైనింగ్‌ అండ్‌ మెషినరీ ఇంజనీరింగ్‌/ మైనింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. 

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు:

ప్రవేశ పరీక్షలో మొత్తం 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. సంబంధిత విభాగానికి నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం ప్రశ్నలు అడుగుతారు.  అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. పరీక్ష సమయం రెండు గంటలు. ఈ టెస్ట్‌లో అర్హత పొందాలంటే జనరల్‌, బీసీ అభ్యర్థులకు కనీసం 36 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 15 శాతం మార్కులు రావాలి. ఇంజనీరింగ్‌ విభాగాలకు ప్రత్యేకించిన సిలబస్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.2000

చివరి తేదీ: జూలై 23 

ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: ఆగస్టు 2న

హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: ఆగస్టు 4 నుంచి

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: ఆగస్టు 7

ఫలితాలు విడుదల: ఆగస్టు 13న

కౌన్సెలింగ్‌ తేదీలు: ఆగస్టు 20 నుంచి 27 వరకు

వెబ్‌సైట్‌: www. uceou.edu



Updated Date - 2022-07-06T20:42:03+05:30 IST