చిలుక ఆచూకీ తెలుపరూ...!

ABN , First Publish Date - 2022-06-30T13:45:26+05:30 IST

ప్రేమగా పెంచుకుంటున్న చిలుక తప్పిపోయిందని, దాని ఆచూకీ తెలిపిన వారిని సన్మానిస్తామని మదురైకి చెందిన వ్యక్తి పోస్టర్లు అంటించి వేడుకుంటున్నారు.

చిలుక ఆచూకీ తెలుపరూ...!

                           - మదురైలో వెలసిన పోస్టర్లు


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 29: ప్రేమగా పెంచుకుంటున్న చిలుక తప్పిపోయిందని, దాని ఆచూకీ తెలిపిన వారిని సన్మానిస్తామని మదురైకి చెందిన వ్యక్తి పోస్టర్లు అంటించి వేడుకుంటున్నారు. మదురై దక్షిణానికి చెందిన సుబ్బరామన్‌ పెంపుడు చిలక ‘వెల్వెట్‌’ఈ నెల 20వ తేది ఇంటి తలుపులు తెరచి ఉంచిన సమయంలో హఠాత్తుగా చిలుక ఎగిరిపోయింది. దీంతో, చిలుక కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో, చిలుక ఆచూకీ తెలపాలని మదురై నగరమంతా పోస్టర్లు అంటించారు. చిలుక ఆచూకీ తెలిపిన వారికి బహుమతితో పాటు సన్మానిస్తామని సుబ్బరామన్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-30T13:45:26+05:30 IST