parotid tumor లక్షణాలు, చికిత్స..

ABN , First Publish Date - 2022-07-08T01:56:54+05:30 IST

సాధారణంగా మనం తినే ఆహారం నోట్లోనే నలుగుతూ ముద్దగా మారడానికి నోట్లో ఉత్పత్తి అయ్యే లాలాజలం ఎంతో సహాయపడుతుంది.

parotid tumor లక్షణాలు, చికిత్స..

హైదరాబాద్: సాధారణంగా మనం తినే ఆహారం నోట్లోనే నలుగుతూ ముద్దగా మారడానికి నోట్లో ఉత్పత్తి అయ్యే లాలాజలం ఎంతో సహాయపడుతుంది. పుల్లని పదార్థాలు చూసినా, తిన్నా చెప్పలేనంత లాలాజలం ఊటబావిలో నీరు ఊరినట్టు ఊరిపోతుంది. ఈ లాలాజలం ఉత్పత్తి కావడానికి కొన్ని గ్రంధులు ఉంటాయి. ఈ గ్రంధులలో ముఖ్యమైనది parotid gland. ఇది దవడ ఎముక వెనుకబాగంలో రెండువైపులా లోపలి చెవి భాగానికి కింద ఉంటుంది. అయితే ఆ భాగంలో అసాధారణంగా కణుతుల పెరుగుదల కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్నే parotid tumor అని వ్యవహరిస్తారు. సాధారణ దిగువతరగతి ప్రజలకు ఇలా ఒక సమస్య ఉందనే విషయం కూడా తెలియదు. 


కారణాలు!


parotid gland కణుతులు రావడంలో జన్యుపరమైన కారణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. ఈ జన్యు కారకాలు కణుతులు ఏర్పడటానికి దోహదం చేసే కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇవి తమ చర్యను అలాగే కొనసాగించినట్టైతే ప్రమాదకరంగా మారతాయి. ఇది మాత్రమే కాకుండా అయోనైజింగ్ రేడియేషన్, uv కిరణాలు, HPV, EBV లేదా HIV వైరస్ లు, సిలికా డస్ట్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఈ పరోటిడ్ గ్రంధి కణుతులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సాధారణ ప్రజలకు కూడా ఉన్న అలవాటులలో ధూమపానం ఒకటి. ధూమపానం చేసేవారిలో కూడా పరోటిడ్ గ్రంధి కణుతులు ఏర్పడతాయి.


లక్షణాలు!


parotid gland కణుతులు ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. వాటిలో దవడభాగం వాపు రావడం ఒకటి. ఇది మొదట్లో ఏమంత ప్రభావం చూపించదు. దీనివల్ల సమస్య ఉన్నట్టు అనిపించదు కూడా. కొందరిలో మాత్రం ఇది ముఖంలో తిమ్మిరిగా ఉండటం, మంట, ముఖం మీది చర్మం ముడతలు పడటం, కదలిక కోల్పోయి బిగుసుకున్నట్టు అవడం జరుగుతుంది. ఈ కణితి పెరుగుదల నెమ్మదిగా ఉన్నట్టయితే అది ఎలాంటి సమస్యనూ సూచించదు కానీ  కణితి పెరుగుదల వేగంగా ఉన్నట్టయితే అది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ముఖంలో ఒకవైపు భాగం కదలడానికి ఇబ్బంది అవుతుంటే దాన్ని ఫేషియల్ నర్వ్ ఫాల్సీ అని అంటారు. ఇది కూడా ప్రమాదాన్ని సూచించే లక్షణమే.


గుర్తించే పద్ధతులు!


parotid gland కణుతుల గురించి నిర్ధారించడానికి రేడియాలాజికల్ మరియు పాథాలాజికల్ అనే పద్ధతులను ప్రయోగిస్తారు. వైద్యుల పరిశీలనలోనే ఈ సమస్యను నిర్ధారించడం సరైనది. రేడియోలాజికల్ పద్దతిలో అల్ట్రాసౌండ్ స్కాన్, CT స్కాన్ లేదా MRI స్కాన్ వంటివి ఉంటాయి. వీటిలో కూడా MRI స్కాన్ ద్వారా పరిశీలించడం వల్ల పరోటిడ్ గ్రంధి కణితి పరిమాణం, దానికి ముఖం నరాలకు ఉన్న సంబంధం, మెడదుతో చర్య ఎలా ఉంది, దానికి చికిత్స చేస్తే ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుంది వంటి విషయాలను చాలా స్పష్టంగా అంచనావేయగలుగుతారు. 


చికిత్స!


parotid gland కణుతుల సమస్యకు చికిత్స ఉంది. దీనికి చిన్న కోత ద్వారా శస్త్రచికిత్స చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ శస్త్రచికిత్స సుమారు 90 నుండి 120 నిమిషాలు ఉంటుంది. చిన్న కోత ద్వారా జరిగే శస్త్రచికిత్స వల్ల ముఖంలో నరాలు దెబ్బతినడం, రక్తస్రావం వంటి సమస్యలు ఏమీ ఉండవు. అలాగే దీన్ని పూర్తిగా తొలగించవచ్చు కూడా.

Updated Date - 2022-07-08T01:56:54+05:30 IST