Abn logo
Mar 27 2020 @ 03:39AM

1200 మంది ఖైదీలకు పెరోల్‌ మంజూరు!

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలకు పెరోల్‌ మంజూరు చేసే అలోచనలో జైళ్ల శాఖ ఉంది. ఏడేళ్లకు లోపల శిక్ష పడిన పలువురు ఖైదీలు పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు అందరికీ మంజూరు చేస్తే సుమారు 1200 మంది వరకూ బయటకు వచ్చే అవకాశముంది. పలు రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీలకు అక్కడి ప్రభుత్వాలు విముక్తి కల్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు జైళ్ల శాఖ ప్రతిపాదనలు పంపింది. 

Advertisement
Advertisement
Advertisement