విభజన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం: ఎంపీ రంజిత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-31T01:18:45+05:30 IST

విభజన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.

విభజన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం: ఎంపీ రంజిత్‌రెడ్డి

హైదరాబాద్: విభజన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతర రంజిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో చర్చించామని తెలిపారు. 23 అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్‌ తమకు ఒక బుక్‌లెట్ అందించారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడుతామని రంజిత్‌రెడ్డి తెలిపారు.


ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్‌ ఎంపీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై  కేసీఆర్‌ చర్చించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఎంపీలకు సీఎం ఇచ్చారు. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని కేసీఆర్‌ తప్పుబట్టారు.

Updated Date - 2022-01-31T01:18:45+05:30 IST