పార్లమెంట్ సమావేశాలను కుదించనున్న కేంద్రం!

ABN , First Publish Date - 2020-09-19T18:21:42+05:30 IST

పార్లమెంట్ సమావేశాలను కుదించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారినపడ్డ

పార్లమెంట్ సమావేశాలను కుదించనున్న కేంద్రం!

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలను కుదించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారినపడ్డ ఎంపీల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికి దాదాపు 30 మంది ఎంపీలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సమావేశాలను కుదిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.


సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని కేంద్రం తలపోసింది. అయితే కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ‘కుదింపు’ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.


‘‘పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ సమావేశాలను కుదించే యోచనలో ఉంది కేంద్రం’’ అని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను ప్రారంభించినా... కేసులు పెరగడంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లు సమాచారం. 

Updated Date - 2020-09-19T18:21:42+05:30 IST