Abn logo
Dec 25 2020 @ 07:46AM

నోబెల్‌ శాస్త్రవేత్తల సరసన తెలుగు తేజం

తిరుపతి రూరల్‌, డిసెంబరు 24: తిరుపతి రూరల్‌ మల్లంగుంటకు చెందిన పార్లపల్లె హేమచంద్రారెడ్డి అమెరికాలోని నోబెల్‌ శాస్త్రవేత్తల క్లబ్‌లో చోటు దక్కించుకున్నారు. 1981-83లో ఎస్వీయూలో ఫిజికల్‌ ఆంత్రోపాలజీ అండ్‌ ప్రి-హిస్టారిక్‌ ఆర్కియాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఏవ సైన్సె్‌సలో ఫెలోగా నియమితులయ్యారు. ఇది గొప్ప శాస్త్రవేత్తలకు మాత్రమే లభించే గౌరవం. నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్న, అందుకోనున్న శాస్త్రవేత్తలు ఈ సంస్థలో ఉంటారు. వృద్ధాప్యంలో మతిమరుపు ఎలా వస్తుందనే అంశంపై హేమచంద్రారెడ్డి విస్తృతంగా పరిశోధించారు. దీంతో ఆయనను నోబెల్‌ శాస్త్రవేత్తల క్లబ్‌లో ఫెలోషి్‌పకు ఎంపిక చేశారు. ఇంతటి గుర్తింపు పొందిన హేమచంద్రారెడ్డికి గౌరవ సూచకంగా ఆయన తల్లి పార్లపల్లె రాజమ్మను మల్లంగుంటలో గురువారం ఘనంగా సన్మానించారు. 

Advertisement
Advertisement
Advertisement