పల్లెలకు ‘ప్రకృతి’ శోభ

ABN , First Publish Date - 2021-01-21T03:51:31+05:30 IST

గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

పల్లెలకు ‘ప్రకృతి’ శోభ
కౌటాల మండలంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం

- ఆసిఫాబాద్‌ జిల్లాలో 200 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు పూర్తి

- 865 చోట్ల కొనసాగుతున్న పనులు 

గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు హరితహారం కార్యక్రమంలో భాగం గా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షిస్తోంది. అలాగే పల్లె ప్రకృతి వనాలను నిర్మాణం చేపడుతూ పచ్చదనం పెంపొందించేందుకు నిధు లు కేటాయించింది. స్థానిక ప్రజాప్రతినిధులకు పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యత అప్పగించింది. 


కౌటాల, జనవరి 20: ఒకప్పుడు పట్టణాలకు వెళ్తేనే పార్కులు కనిపించేవి. పల్లె ప్రజలు పార్కులు చూడాలంటే పట్టణాలకు వెళ్లాల్సిం దే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెలో పార్కులను తలపించేలా ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని నిర్ణయించింది. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించింది.  ప్రస్తు తం కొన్చి చోట్ల పనులు పూర్తి కావడంతో పల్లె ప్రకృతి వనాలు పచ్చ దనాన్ని తలపిస్తున్నాయి. 

జిల్లాలో స్థలాల గుర్తింపు..

జిల్లాలో 1,065 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అధికారులు స్థలాలను గుర్తించారు. ఈ మేరకు 865 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పనులు కొనసాగు తున్నాయి. స్థల వైశ్యాల్యాన్ని బట్టి రూ. 5 లక్షల నుంచి 7లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఇప్పటికే దాదాపు 200 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పనులు పూర్తయ్యాయి. మొత్తంగా 1,102 పల్లె ప్రకృతి వనాలు నిర్మించాల్సి ఉంది. కొన్ని చోట్ల స్థల సేకరణకు ఇబ్బందులు తలెత్తడంతో పనులు ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. కౌటాల మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరంగా ఉండడంతో ఆదర్శప్రాయంగా ఉందని పలువురు కొనియాడుతున్నారు. కౌటాల  పల్లె ప్రకృతి వనానికి ఒక వైపు కంకాలమ్మ గుట్ట, మరో వైపు సాయిబాబా గుట్ట ఉన్నాయి. దీంతో ఎటూ చూసిన ఆహ్లాదకర వాతావరణ కనబడుతోంది. కౌటాల పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, జడ్పీ సీఈవో సాయగౌడ్‌, డీపీవో రమేశ్‌ అన్ని గ్రామాల అధికారులు, ప్రజాప్రతినిధులు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొ నడం విశేషం. ఇదిలా ఉండగా ఇప్పటికే బెజ్జూరు మండలంలో 47 మంజూరు కాగా అన్ని పూర్తయ్యాయి, అలాగే చింతల మానేపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు పూర్త య్యాయి. సిర్పూర్‌(టి) మండలంలో సైతం దాదాపుగా పూర్తి కావాల్సి వచ్చాయి. 

సందర్శకుల సందడి..

కౌటాల మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనం పూర్తి కావడంతో సందర్శకుల రద్దీ పెరిగింది. కౌటాల పల్లె ప్రకృతి వనం కోసం రెండు ఎకరాలకు పైగా స్థలం కేటాయించారు. రూ. 7లక్షలతో పనులు పూర్తి చేశారు.  పలు రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. దీంతో పాటు పిల్లల కోసం ఉయ్యాలలు, జారుబండ ఏర్పాటు చేశారు. వ్యాయం చేసే పరికరాలను అందుబాటులో ఉంచడంతో యువకులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలతో పాటు పిల్లలు ఉదయం, సాయంత్రం వచ్చి ఆహ్లాదకరంగా గడుపుతు న్నారు. పిల్లలను ఆకట్టుకునేందుకు పెయింటింగ్‌తో పాటు బెంచీలపై ఆకట్టుకునే పక్షులు, మిక్కీమౌస్‌ తదితర రకాల బొమ్మలు చిత్రీకరించా రు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా గడిపిన వృద్ధులకు ప్రస్తుతం ఈ ప్రకృతి వనాలు ఎంతో కాలక్షేపాన్ని ఇస్తున్నాయి. 

పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదం..

- పి.తిరుపతి, కౌటాల ఉప సర్పంచ్‌

గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదం కలుగుతోంది. మాసిక ఒత్తిడి గురువుతున్న వారు ఈ పల్లె ప్రకృతి వనంలో కొద్ది సేపు కాలక్షే పం చేయడం వల్ల ఉల్లాసం పొందుతున్నారు. 

గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నాం..

- విశ్వనాథ్‌, ఎంపీపీ, కౌటాల

గ్రామాల్లో ప్రకృతి వనాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా స్థలం విషయంలో వివాదాలు ఉంటే గ్రామంలో చర్చించి నిర్ణయం తీసు కుంటున్నాం. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్లయ్యేలా చూస్తున్నాం.

Updated Date - 2021-01-21T03:51:31+05:30 IST