NRI: కెనడాలోని పార్క్‌కు పేరు మార్పు.. ‘శ్రీ భగవద్గీత’గా నామకరణం..

ABN , First Publish Date - 2022-10-02T00:45:12+05:30 IST

కెనడాలోని ఓ పార్కుకు(Park) తాజాగా ‘శ్రీ భగవద్గీత’ అని పేరు పెట్టారు.

NRI: కెనడాలోని పార్క్‌కు పేరు మార్పు.. ‘శ్రీ భగవద్గీత’గా నామకరణం..

ఎన్నారై డెస్క్: కెనడాలోని ఓ పార్కుకు(Park) తాజాగా ‘శ్రీ భగవద్గీత’ అని పేరు పెట్టారు. అంతకుముందున్న పేరును తొలగించి ఈ పేరు పెట్టారు. హరియాణా ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. ఓంటారియో(Ontario) ప్రావిన్స్(రాష్ట్రం)లోని బ్రాంప్టన్(Brampton) నగరంలో ఈ పార్కు ఉంది. బుధవారం జరిగిన పేరుమార్పు కార్యక్రమానికి నగర మేయర్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ హాజరయ్యారు. సమాజ అభ్యున్నతి కోసం స్థానిక హిందువులు చేసిన సేవకు గుర్తింపుగా పార్కుకు ‘శ్రీ భగవద్గీత’(Bhagvat Gita) అని పెరుపెట్టినట్టు ఆయన వివరించారు. తమ నగరంలో అన్ని సంస్కృతులు, మతాలకు ఉన్నతస్థానం ఉంటుందని మేయర్ వ్యాఖ్యానించారు. కాగా.. 3.75 ఎకరాల్లో విస్తరించిన ఈ ఉద్యానవనంలో.. కొన్ని హిందూదేవతల విగ్రహాలతో పాటూ.. రథారూఢులైన కృష్ణార్జునుల విగ్రహాలు కూడా ఉన్నాయి. మరోవైపు.. పార్కుకు ‘భగవద్గీత’ పేరు పెట్టడంపై హరియాణా ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. మానవాళికి భగవద్గీత ఇచ్చిన సందేహాన్ని మరింత విస్తృత పరిచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ పేర్కొన్నారు. కాగా.. విదేశాల్లో భగవద్గీత పేరిట ఉన్న పార్క్ ఇదొక్కట్టే అని తెలుస్తోంది.  



Updated Date - 2022-10-02T00:45:12+05:30 IST