అనంతపురం: మహిళా దినోత్సవం రోజునే మహిళలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సునీత మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోనే హత్యకు గురైన మహిళకు న్యాయం చేయలేని వారు, మహిళలకి ఏదో చేస్తానని చెప్పడం ఎన్నికాల స్టంట్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రశ్నించిన తెలుగుదేశం నేతలపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. మహిళలకు జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని సునీత ధ్వజమెత్తారు.