పరిటాల రవీంద్ర వర్ధంతి రద్దు

ABN , First Publish Date - 2022-01-21T05:59:58+05:30 IST

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతిని ఈ ఏడాది రద్దు చేసుకున్నట్లు మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

పరిటాల రవీంద్ర వర్ధంతి రద్దు

అభిమానుల ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయం... పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌

అనంతపురం వైద్యం, జనవరి 20: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతిని ఈ ఏడాది రద్దు చేసుకున్నట్లు మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అభిమానులు, టీడీపీ కార్యకర్తల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 17 ఏళ్లుగా ఏటా జనవరి 24న పరిటాల వర్ధంతి వెంకటాపురంలో నిర్వహిస్తున్నారు. ప్రముఖ నేతలతోపాటు పెద్దఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు వేడుకలకు హాజరయ్యేవారు. ఆ రోజున పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. కరోనా పాజిటివ్‌ కేసులు అమాంతం పెరుగుతున్న నేపథ్యంలో పరిటాల రవీంద్ర వర్ధంతిని ఈసారి రద్దు చేసుకున్నట్లు సునీత, శ్రీరామ్‌ తెలిపారు. ఇందుకు అభిమానులు, టీడీపీ శ్రేణులు సహకరించాలనీ, వెంకటాపురానికి ఎవరూ రాకుండా ఎక్కడివారు అక్కడ కరోనా నిబంధనలు పాటిస్తూ పరిటాల రవీంద్రకు నివాళులర్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2022-01-21T05:59:58+05:30 IST