Abn logo
Sep 21 2021 @ 01:10AM

‘పరిషత్‌’ కళకళ

ఒంగోలులోని జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న రాజకీయ నేతలు

దాదాపు రెండేళ్ల తర్వాత జడ్పీ వద్ద రాజకీయ సందడి  

జడ్పీటీసీలకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేత

ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 20: దాదాపు రెండేళ్ల తర్వాత జిల్లా పరిషత్‌ కార్యాలయం మళ్లీ కళ సంతరించుకుంది. సోమవారం కోలా హలంగా కనిపిం చింది. చివ రిసా రిగా 2019 జూలైలో పాలకవర్గం గడువు పూర్తికావ డంతో అప్పటి నుంచి కలెక్టరే ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పరిషత్‌ ఫలితాలు కూడా విడుదలై 25న జిల్లా పరిషత్‌ కొత్త పాలకవర్గం కొలువుదీరబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను జడ్పీ యంత్రాంగం శరవేగంగా పూర్తిచేస్తోంది. ఆదివారం నాటి కౌంటింగ్‌ ప్రక్రియల్లో గెలుపొందిన జడ్పీటీసీలకు ఆర్‌వోగా వ్యవహరించిన జడ్పీ సీఈవో దేవానందరెడ్డి సోమవారం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. జిల్లావ్యాప్తంగా గెలుపొందిన ఆయా జడ్పీటీసీ అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచే కార్యాల యానికి చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. 


రెండు సంవత్సరాల తర్వాత...

2019 జూలైతో అప్పటి పాలక వర్గం గడువు ముగిసింది. మళ్లీ ఇప్పుడు కొత్త పాలకవర్గం కొలు వుదీరనుండటంతో రాజకీయ సందడికి పరిషత్‌ మళ్లీ వేదికగా నిలిచింది. ఇకపై స్థాయీ సంఘాలు కూడా పాలనలో కీలకపాత్ర పోషించబోతున్నాయి. ప్రజల అవసరాలకు తగ్గట్లు ఆయా సమస్యలపై జడ్పీటీసీల చేత కీలకమైన స్థాయీ సంఘా లు పాలకవర్గం దరిమిలా ఏర్పడనున్నాయి. పల్లెల్లో జడ్పీ నిధులతో జరిగే పనుల్లో కూడా వేగం పెరిగే అవకాశముంది. నెల 25న ఎన్నిక నిర్వహించనున్న జడ్పీ కొత్త పాలకవర్గానికి సంబంధించి జడ్పీటీసీలకు పరిషత్‌ అధికారులు రాతపూర్వకంగా సమాచారం అందించనున్నారు. వారితోపాటు జిల్తావ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నారు.


పాత జడ్పీ సమావేశ  మందిరంలో ఏర్పాట్లు

25న కొత్త పాలకవర్గం ఎన్నిక, అంతకు ముందు సభ్యుల ప్రమాణ స్వీకారానికి పాత జడ్పీ సమావేశ మందిరం వేదిక కాబోతోంది. ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ విడుదలైనప్పుడే దాని మరమ్మతుల కోసం జడ్పీ నుంచి నిధులు కేటాయించారు. ప్రస్తుతం పనులు ఊపందుకున్నాయి. పూర్తిహంగులతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమావేశ మందిరాన్ని ముస్తాబు చేస్తున్నట్లు జడ్పీ వర్గాలు చెబుతున్నాయి.