Jun 7 2021 @ 23:02PM

నిద్ర మంచిదే: పరిణీతి చోప్రా!

మార్చిలో విడుదలై విజయం సాఽధించిన ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ సక్సెస్‌ సందడి నుంచి ఇంకా బయటకు రాలేదు పరిణీతి చోప్రా. చాలాకాలం తర్వాత తనకొచ్చిన సక్సెస్‌ అనీ, పరిణీతికి కమ్‌బ్యాక్‌ సినిమా అనీ విమర్శకులు ప్రశంసిస్తుంటే ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘కొన్ని సందర్భాల్లో మనం వింత్తైన ప్రపంచంలోకి వెళ్లిపోతాం. నటిగా మనం ఏం చేస్తున్నాం? పాత్రకు కావలసిన దానికంటే ఎక్కువ పెర్‌ఫామ్‌ చేయాలని ప్రయత్నిస్తాం. అది మనం గొప్పతనం కాదు. ఆ పాత్ర, దాని వెనకున్న క్రియేటివిటీ గొప్పతనం. ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ చిత్రం విషయంలో అదే జరిగింది. ఇదొక నిద్రించడం లాంటి ప్రక్రియ. అప్పటి వరకూ నేనెం చేస్తున్నానో కూడా గ్రహించలేకపోయా. సందీప్‌ పాత్ర నిద్రిస్తున్న నన్ను మేల్కొలిపింది. రీలైజ్‌ అయ్యేలా చేసింది. మూడు నెలలపాటు నేను అదే జోన్‌లో ఉండి శక్తిని మించి నటించేలా చేసింది. ఇంతకు ముందు కూడా నేను బలమైన పాత్రలు పోషించా. ఇంకా ఎక్స్‌ఫ్లోర్‌ కావాలని ప్రయత్నించా. ఈ సినిమా షూటింగ్‌లో మాత్రం నేను నిద్రలోకి  వెళ్లా. నిద్ర లేచేసరికి ప్రేక్షకులంతా సాండీ పాత్రను తెరపై ఆస్వాదిస్తున్నారు. అవార్డ్‌ సినిమా అనీ, కమ్‌బ్యాక్‌ సినిమా అనే మాటలు వింటుంటే ఆనందంతో భావోద్వేగానికి గురవుతున్నా. ఇలాంటి పాత్రకు నాకు ఇచ్చిన దర్శకుడు దిబాకర్‌కు రుణపడి ఉంటా’’ అని రాసుకొచ్చారు పరిణీతి. 



Bollywoodమరిన్ని...