Abn logo
Mar 8 2021 @ 20:13PM

‘సైనా’ ట్రైలర్‌: మరో మైల్‌స్టోన్‌

లాస్ట్ వీక్‌ టీజర్‌ రిలీజ్‌ చేసిన తర్వాత, ఈ రోజు(సోమవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరల్డ్ చాంపియన్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ సైనా మూవీ ట్రైలర్‌ని విడుదల చేసింది ఈ బయోపిక్‌ను నిర్మించిన ఫ్రంట్‌ ఫుట్‌ సంస్థ. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సైనా బయోపిక్‌లో సైనా నెహ్వాల్‌ పాత్రను పోషించిన బాలీవుడ్‌ స్టార్‌ పరిణీతి చోప్రా కూడా తన పర్సనల్‌ ట్విట్టర్‌ హేండిల్‌ ద్వారా సోషల్‌ మీడియాలో ఈ ట్రైలర్‌ని షేర్‌ చేసింది. విడుదలైన క్షణాలలో లెక్కలేనన్ని వ్యూస్‌, షేర్స్ విజృంభించేశాయి. దీనికి కారణం సైనా నెహ్వాల్‌కి వ్యక్తిగతంగా ఉన్న స్టార్‌డమ్‌తో పాటు పరిణీతి చోప్రా ఆ పాత్ర చేయడంతో ఈ బయోపిక్‌కి అనూహ్యమైన పాప్యులారిటీ ఆటోమేటిక్‌గా వచ్చింది. మొట్టమొదటిసారి బయోపిక్‌లో యాక్ట్ చేయడం మొదలుపెట్టిన అనంతరం సైనా నెహ్వాల్‌ తన పర్సనల్‌ సోషల్‌ మీడియా అక్కౌంట్‌లో తన కామెంట్‌ను పోస్ట్ చేయడం మరో అట్రాక్షన్‌గా నిలిచింది. “మహిళా దినోత్సవం రోజున ఈ ట్రైలర్‌ని షేర్‌ చేయడానికి గర్వపడుతున్నా” అని సైనా కామెంట్‌ చేసింది. 

సైనా నెహ్వాల్‌ పాత్రలో పరిణీతి చోప్రా ప్రతీ ఫ్రేంలోనూ రియల్‌ టైం ఎక్సైట్‌మెంట్‌ని నింపడంతో పాటు, సైనా మదర్‌గా నటించిన మేఘా మాలిక్‌ అందరి దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. మేఘా మాలిక్‌ లోగడ సోప్ ఓపెరా ఫినిట్‌ సిరీస్‌ ద్వారా శాకుంతలమ్‌ టెలీఫిలిమ్స్ సంస్ధ నిర్మించిన లాడూ సీరియల్‌తో ఇండియా వైడ్‌ పాప్యులారిటీని సొంతం చేసుకుంది. మేఘామాలిక్‌ మాట్లాడిన హర్యాన్వీ యాస ఆమెకు నేచురల్‌ టచ్‌నిచ్చింది. సైనా పాత్రలో పరిణీతి చోప్రా పెర్‌ఫార్మెన్స్‌ని బాలీవుడ్‌ మీడియా భుజానికెత్తుకుని మరీ ప్రచారం చేస్తోంది. పరిణీతి హర్యానీ భాషలో యాసతో డైలాగ్‌ చెప్పిన విధానం, బ్యాడ్మింటన్‌ ఆడుతున్నప్పుడు ఒరిజినల్‌ ప్లెయర్‌లా పరఫెక్టుగా మువ్‌ అవడం.. ఇవన్నీ ఎంతో కరెక్టుగా సరిపోవడంతో సైనా బయోపిక్‌ ఓ మైల్‌స్టోన్‌గా సంచలనం సృష్టిస్తుందని నార్త్‌ మీడియా ముక్తకంఠంతో మురిసిపోతోంది. 


సైనా నెహ్వాల్‌ పాత్రను మొదట శ్రద్ధా కపూర్‌కి ఆఫర్ చేశాడు దర్శకుడు అమోల్‌ గుప్తే. కొంత పార్ట్‌ కూడా షూటింగ్‌ పూర్తయిన తర్వాత డేట్స్ క్లాష్‌ అడ్డొచ్చింది. డేట్స్ అడ్జస్ట్ చేయడానికి కుదరక శ్రద్ధా ప్రాజెక్టును వదులుకుంది. అప్పడు పరిణీతి చోప్రాను ఎంచుకున్నారు. ఈ బయోపిక్‌ లాస్ట్ ఇయర్‌ సెప్టెంబర్‌లోనే విడుదల చేయాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా రిలీజ్‌ను వాయిదా వేసి, ఇప్పడు మార్చి 26న విడుదలకు సిద్ధం చేశారు నిర్మాతలు. 

Advertisement
Advertisement
Advertisement