Advertisement
Advertisement
Abn logo
Advertisement

గోవిందా.. గోవింద

పారిజాత గిరి వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు 

జంగారెడ్డిగూడెం, అక్టోబరు 23:గోకుల తిరుమల పారిజాత గిరి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, తీర్థప్రసాద గోష్టి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కాకాని శ్రీకాంత్‌, నాగరాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారని చైర్మన్‌ ఉప్పల గంగాధరం, ఈవో సంగమేశ్వరశర్మ తెలిపారు.

మద్ది ఆంజనేయుడికి పంచామృతాభిషేకం..

గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామికి శనివారం అర్చకులు, వేద పండితులచే ఏకాంతంగా పంచామృతాభిషేకం నిర్వహించారు.  భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. ప్రతీ శనివారం పంచా మృత అభిషేకం చేయించుకోదలచిన భక్తులు రూ.1,116 కరూర్‌ వైశ్య బ్యాంక్‌  ఖాతా 1429155000034115, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : కేవీబీఎల్‌ 0001429కు జమచేసి దేవస్థానం సీనియర్‌ అసిస్టెంట్‌ అన్నవరం 99519 19962 నంబరుకు తెలపాలన్నారు. దేవస్థానంలో నవంబరు 5 నుంచి డిసెంబరు 4 వరకు కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం పందిరి రాట ముహూర్తం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ధర్మకర్త  చిలుకూరి సత్యనారాయణరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కీసరి సరితా విజయభాస్కరరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తదితరులు తెలిపారు.

మద్దిలో కార్తీక మాసోత్సవాలకు పందిరి రాట పూజలు


Advertisement
Advertisement