Abn logo
Sep 22 2021 @ 01:00AM

పరిహా(ర)సమేనా ?

అంజనాద్రినగర్‌ ప్లాట్ల బాధితులు

 రింగురోడ్డు బాధితులకు అందని పరిహారం

 ప్రొసీడింగ్స్‌ ఇచ్చి చేతులుదులుపుకున్న అధికారులు

 అంజనాద్రినగర్‌లో 124 మంది బాధితులు

 యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టి న రింగురోడ్డుతో నిర్వాసితులవుతున్న బాధితులకు నేటికీ పరిహారం అందలేదు. అంజనాద్రినగర్‌లో మొత్తం 124 మంది బాధితులు ఉండగా, వారికి నెలల క్రితం ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన అధికారులు పరిహారం చెల్లింపును మాత్రం మరిచారు. ఇటీవల నిర్వాసితులు మూడురోజుల పాటు వంటావార్పు, ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.

- యాదాద్రి టౌన

యాదాద్రిక్షేత్రం పరిధిలోని అంజనాద్రినగర్‌ ప్లాట్ల బాధితులు పరిహారం కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రొసీడింగ్‌ కాపీలు అందజేసి నెలలు గడుస్తు న్నా, పరిహారం అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా పా త గోశాల ప్రాంతంలోని సర్వే నెం.69, 71, 72లలో 8.20 ఎకరాల స్థలాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. అయితే అంజనాద్రినగర్‌లోని సుమా రు 56ఇళ్ల యజమానులకు మాత్రమే నష్టపరిహారం అందజేశారు. మిగతా 124మంది ప్లాట్ల యజమానులకు పరిహారానికి సంబంధించి కేవలం ప్రొసీడింగ్‌లను మా త్రమే అందజేశారు. ప్రొసీడింగ్‌ కాపీలు అందజేసి నెల లు గడిచినా నష్టపరిహారం అందకపోవడంపై బాధితు లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాధితు లు కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశా రు. భూసేకరణ చేసి, నెలలు గడుస్తున్నా ప్లాట్ల యజమానుకు పరిహారం అందకపోవడంతో మూడురోజులు గా తమదైనరీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన బాధితులు అంజనాద్రినగర్‌ ప్లాట్ల ప్రాంతంలో టెంట్‌ వేసుకుని ధర్నాకు దిగారు. దీంతో రెవెన్యూ అధికారులు బాధితులకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నష్టపరిహారంకోసం ప్రభుత్వానికి పంపామని, త్వరలోనే పరిహారం బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుందని వివరించారు. అయితే బాధితులు మాత్రం నష్టపరిహారం విడుదలపై స్పష్టమైన సమాచారం అధికారులు ఇవ్వాలని, లేదంటే నిరసనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. 


తక్షణమే పరిహారం చెల్లించాలి

భూ నిర్వాసితులకు తక్షణమే ప్రభుత్వం పరిహా రం అందజేయాలి. నష్టపరిహారంపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అప్పటివరకు ప్లాట్ల వద్దకు అధికారులను రానిచ్చేదిలేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి.


త్వరితగతిన పరిహారం :   డి.శ్రీనివా్‌సరెడ్డి, అదనపు కలెక్టర్‌ 

యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా భూము లు,ప్లాట్లు కోల్పోతున్న నిర్వాసితులకు త్వరలోనే పరిహారం అందజేస్తాం. ఇప్పటికే పరిహారానికి సంబందించిన నివేదికలు ప్రభుత్వానికి పంపాం. త్వరలోనే బాధితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం.