కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వ‌దేశానికి రప్పించండి

ABN , First Publish Date - 2020-06-07T13:37:02+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న వైద్య విద్యార్థులను భారత్‌కు రప్పించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అమీర్‌పేట ఐఎ్‌సఎం ప్రతినిధులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.

కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వ‌దేశానికి రప్పించండి

మంత్రి కొప్పులకు తల్లిదండ్రుల విజ్ఞప్తి

పటాన్‌చెరు రూరల్‌, జూన్‌ 6: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న వైద్య విద్యార్థులను భారత్‌కు రప్పించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అమీర్‌పేట ఐఎ్‌సఎం ప్రతినిధులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌ నుంచి విద్యార్థులు భారత్‌ రావడానికి పడుతున్న ఇబ్బందులను, అక్కడి భారత దౌత్య అధికారుల నిర్లక్ష్యపు తీరును శనివారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో పాటు ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తానని మంత్రి కొప్పుల హామీ ఇచ్చారు. మంత్రి చొరవతో ఐఎ్‌సఎం ప్రతినిధులు నాగేశ్వరరావు, రామారావు కొంతమంది తల్లిదండ్రులతో సోమవారం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను కలవనున్నారు. 

Updated Date - 2020-06-07T13:37:02+05:30 IST