U18 విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-12-04T22:47:31+05:30 IST

U18 విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి

U18 విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి

బెంగళూరు: దేశంలో మొదటి రెండు కోవిడ్-19 ఓమైక్రాన్ వేరియంట్ కేసులు బెంగళూరులో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త వేరియంట్ ఓమైక్రాన్‌ను బెంగళూరులో గుర్తించిన ఒకరోజులోనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 18 ఏళ్ల లోపు విద్యార్థులు తమ తల్లిదండ్రులు కరోనా వైరస్‌ కట్టడికి పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకుంటేనే ఆఫ్‌లైన్ తరగతులకు అనుమతించబడతారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అన్ని పాఠశాలలు, కాలేజీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్యాంపస్‌లో నిర్వహంచే ఫెస్టివల్స్‌ను జనవరి 15 వరకు వాయిదా వేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొత్త వేరియంట్ ఓమైక్రాన్ నివారణపై నిపుణులతో చర్చించిన తర్వాత కొత్త నిబంధనలను ప్రకటిస్తామని సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. వివాహాలు, బహిరంగ సమావేశాలు, కాన్ఫరెన్స్ హాల్‌లో 500 మందికి మించి పాల్గొనరాదని ప్రభుత్వం పేర్కొంది. థియేటర్స్, మాల్స్‌కు  వెళ్లాంటే పూర్తి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలని సర్కారు నిబంధనలు విధించింది. రోజువారీ కోవిడ్ పరీక్షలను 60 వేల నుంచి లక్ష వరకు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్బన్ ప్రాంతాల్లో రోజు 35 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.

Updated Date - 2021-12-04T22:47:31+05:30 IST