Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పిల్లలు మాట వినడం లేదా? అయితే ఇవి తెలుసుకోండి..

twitter-iconwatsapp-iconfb-icon
పిల్లలు మాట వినడం లేదా? అయితే ఇవి తెలుసుకోండి..

ఆంధ్రజ్యోతి(28-03-2022)

పిల్లలు పెద్దల మాట వినడం లేదంటే అందుకు కారణం పిల్లల్లోనే కాదు పెద్దల్లోనూ ఉంటుంది. కాబట్టి పెద్దలు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి.


పిల్లలు ఆకలిగా ఉన్నారా లేక అలసిపోయారా?

 నేను వాళ్లు చెప్తున్నది ఆలకిస్తున్నానా? సాధారణంగా పిల్లలు పెద్దలనే ఆనుసరిస్తారు. వాళ్లు చెప్తున్నది వినే అలవాటు, ఆసక్తి కనబరిచే అలవాటు పెద్దలకు లేకపోతే, పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు.


పిల్లలను ఒత్తిడికి లోను చేస్తున్న అంశాలేవైనా ఉన్నాయా?

పిల్లల లేత మనసులను అర్థం లేని భయాలు వేధించే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడు పరధ్యానంలో పడతారు. కాబట్టి వాళ్లను ఆందోళనకు గురి చేస్తున్న అంశాల గురించి ఆరా తీయాలి.


నలతగా ఉన్నప్పుడు కూడా పిల్లలు మాటలకు స్పందించరు. కాబట్టి పిల్లల్లో హుషారు తగ్గిందేమో గమనించాలి.

విసుక్కోవడం, చీదరించుకోవడం, కోపం ప్రదర్శించడం... పెద్దలు ఇలా ప్రవర్తించినప్పుడు కొందరు పిల్లలు నిశ్శబ్దంగా మారిపోతారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు. పిలిచినా పలకరు. కాబట్టి పెద్దలు ఓర్పుతో, నేర్పుతో కారణాన్ని తెలుసుకుని, ప్రేమతో మాట్లాడుతూ పిల్లల మనసులను తేలిక పరచాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.