తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే

ABN , First Publish Date - 2022-10-02T06:32:34+05:30 IST

వృద్ధాప్యంలో తల్లిదం డ్రుల పోషణ పిల్లల బాధ్యతేనని అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు.

తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

సిరిసిల్ల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలో తల్లిదం డ్రుల పోషణ పిల్లల బాధ్యతేనని అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా రగుడు చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. వృద్ధులను, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్న వారిని సన్మానించారు. అనం తరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ తల్లితండ్రుల పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.  కుటుంబ విలు వలతో భారతీయ సంస్కృతి ఏర్పడిందని, తల్లిదండ్రుల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చే పరిస్థితి రావడం   దుర దృష్టకరమని అన్నారు. వృద్ధులు కనీసం ఆత్మగౌరవంతో జీవిం చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజే స్తోందన్నారు.  తల్లిదండ్రులకు కావాల్సిన కనీస అవసరాలను పిల్లలు తీర్చాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం నేరమవు తుం దని అన్నారు. ఈ చట్టం ప్రకారం వయోవృద్ధులు సమస్యలపై స్థానిక తహసీల్దార్‌ లేదా ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే వెంటనే  చర్యలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రుల పోషణ చట్టం పై జిల్లాలో విస్తృత ప్రచారం కల్పిస్తే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందన్నారు.  జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ వయోవృద్ధులకు గౌరవం ఇవ్వాలని, వారికి సమాజంలో సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీడీపీవోలు అలేఖ్య, ఎల్లయ్య, ఝాన్సీ శుక్లా, జనపాల శంకరయ్య, బలరాం, సయూద్‌ఖాన్‌, పాల్గొన్నారు.

ఇల్లంతకుంట:మండలంలోని అనంతారంలో శనివారం వృద్దులను సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ ఆధ్వర్యంలో సన్మానించారు. ఎంపీటీసీ తీగల పుష్పలత, నాయకులు వొల్లాల రవీందర్‌గౌడ్‌, ఎలుక రాజయ్య, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, వెంకటమ్మ, మంగమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T06:32:34+05:30 IST