Chennai: పరరివాలన్‌కు ఆరోసారి పెరోల్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2021-10-27T13:58:46+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు ముద్దాయిలలో ఒకరైన పేరరివాలన్‌కు ఆరోసారి పెరోల్‌ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేరరివాళన్‌ ముప్పై యేళ్ళకు పైగా జైలు శిక్షను అనుభవి

Chennai: పరరివాలన్‌కు ఆరోసారి పెరోల్‌ పొడిగింపు

చెన్నై(Tamilnadu): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు ముద్దాయిలలో ఒకరైన పేరరివాలన్‌కు ఆరోసారి పెరోల్‌ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ  చేసింది. పేరరివాళన్‌ ముప్పై యేళ్ళకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆరుమాసాలుగా పేరరివాళన్‌ మూత్రాశయ సమస్యలతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ నేపథ్యంలో తన కుమారుడికి పెరోల్‌ మంజూరు చేయాలని పేరరివాళన్‌ తల్లి అర్బుదమ్మాళ్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకుని విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు గత మే 28న ఆయనకు నెల రోజులపాటు పెరోల్‌ మంజైరైంది. ఆ తర్వాత పెరోల్‌ మరో నాలుగు నెలలపాటు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం పేరరివాళన్‌ విల్లుపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో తన కుమారుడికి పెరోల్‌ పొడిగించమంటూ అర్బుదమ్మాళ్‌ మరోమారు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఐదో విడత పెరోల్‌ గడువు మంగళవారం ముగియనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పేరరివాళన్‌కు మరో 30 రోజులపాటు పెరోల్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2021-10-27T13:58:46+05:30 IST