permission, Mandatory: జైలులో కొరియర్‌ పార్శిళ్లకు అనుమతి తప్పనిసరి

ABN , First Publish Date - 2022-08-10T17:03:26+05:30 IST

బెంగళూరు పరప్పన అగ్రహార జైలు(Bangalore Parappana Agrahara Jail)లోని ఖైదీలు కొరియర్ల ద్వారా పార్శిళ్లు తెప్పించుకోవాలంటే

permission, Mandatory: జైలులో కొరియర్‌ పార్శిళ్లకు అనుమతి తప్పనిసరి

బెంగళూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు పరప్పన అగ్రహార జైలు(Bangalore Parappana Agrahara Jail)లోని ఖైదీలు కొరియర్ల ద్వారా పార్శిళ్లు తెప్పించుకోవాలంటే ముందస్తుగా జైలు సూపరింటెండెంట్‌ అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు జైలు ఉన్నతాధికారులు మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతులు లేకుండా వచ్చే ఎలాంటి పార్శిళ్లను స్వీకరించవద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ఖైదీలు పార్శిళ్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత వస్తువులను దర్జాగా తెప్పించుకుంటున్నట్లు ఇటీవలి పరిశీలన సమయంలో గుర్తించారు. పార్శిల్లో ఏమేమి తెప్పించుకుంటున్నదీ ఖైదీలు ముందుగా జైలు(prison) అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం సదరు పార్శిల్‌ను అధికారుల సమక్షంలోనే తెరచిచూసి ఆపై ఖైదీలకు అందజేస్తారు. ఈ నియమాలను ఉల్లంఘించే ఖైదీలు, జైలు సిబ్బందిపై తగినచర్యలు ఉంటాయని మంగళవారం విడుద ల చేసిన ప్రకటనలో ఆ శాఖ పేర్కొంది.

Updated Date - 2022-08-10T17:03:26+05:30 IST