Abn logo
Mar 29 2020 @ 20:36PM

రూ.116 కోట్ల విరాళం ప్రకటించిన పారామిలటరీ బలగాలు

న్యూఢిల్లీ: దేశంలోని పారామిలటరీ బలగాలు తమ ఒక రోజు వేతన మొత్తం రూ. 116 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలిపారు. దేశ భద్రత కోసం, ఐక్యత కోసం  పారామిలటరీ బలగాలు ఎల్లప్పుడూ దోహదపడుతూనే ఉన్నాయని ప్రశంసించిన షా.. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. దేశంలో మొత్తం 10 లక్షల మంది పారామిలటరీ సిబ్బంది సరిహద్దుల్లో సేవలు అందిస్తున్నారు. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement