Paramedical courseల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-24T12:34:53+05:30 IST

హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పారా మెడికల్‌ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని

Paramedical courseల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పారా మెడికల్‌ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఎంహెచ్‌ఓ వెంకటి తెలిపారు. ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. తెలంగాణ పారా మెడికల్‌ బోర్డు ww-w.t-s-p-m-b.te-lan-gana.-go-v.-in లో దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకుని డిసెంబర్‌ 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సికింద్రాబాద్‌ హరిహర కళాభవన్‌ వద్దగల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-24T12:34:53+05:30 IST