పరక

ABN , First Publish Date - 2021-05-17T06:09:52+05:30 IST

జొరబడాలి చీకటి నుండి దీపంలోకి ప్రవాహం నుండి అనంతంలోకి మట్టి నుండి శూన్యంలోకి అదిగో అట్లే ఊపిరి నుండి మనసులోకి కూడా...

పరక

జొరబడాలి

చీకటి నుండి దీపంలోకి

ప్రవాహం నుండి అనంతంలోకి

మట్టి నుండి శూన్యంలోకి

అదిగో అట్లే

ఊపిరి నుండి మనసులోకి కూడా...

జొరబడి

గోడలను కూల్చాలి

నీడలను ప్రశ్నించుకోవాలి


పరక పుల్లలు ఏం చేస్తాయి?

సమూహంగా చేరి

వీధులను,

వీధుల్లో కుప్పలు కుప్పలుగా

కుళ్లిపోయి తిరుగుతున్న ప్రాణాలను

శుభ్రపరుస్తాయి,  

హరిత వనాలుగా మారుస్తాయి

పిడికిట్లో ఆయుధంగా మారతాయి


ఒక గట్టు నుండి

ఇంకో గట్టుకు దూకుతున్నప్పుడు

రెండు కాళ్ల మధ్య దూరం

     కొన్ని బంధాలు,

     విశ్వాసాలు, నమ్మకాలు  

అన్నీ చెదిరిపోయిన మేఘాలే,

     వాన చినుకులే.


అన్యాయంగా దూకడానికి,

ప్రేమగా జొరబడటానికి

ఎంత వ్యత్యాసం?

బహుశ!

కన్నుకు చూపుకు ఉన్నంత కావచ్చు

కన్ను మంచిదే...

మరి చూపు?


కింద ఎవరో...

ఎగురుతున్నారు

మరి అదేంటో!

జె.బి.

72595 11956

Updated Date - 2021-05-17T06:09:52+05:30 IST