పారా పోలీసుల సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-02-26T04:12:50+05:30 IST

ఇటీవల పంచాయతీ ఎన్నికలలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా మండలంలోని పారా పోలీసు సిబ్బంది, సచివాలయ సిబ్బంది అంకిత భావంతో పని చేశార ని తహసీల్దార్‌ జయపాల్‌ అన్నారు.

పారా పోలీసుల సేవలు అభినందనీయం
ప్రశంసాపత్రాలు అందజేస్తున్న తహసీల్దార్‌ జయపాల్‌


రాచర్ల, ఫిబ్రవరి 25 : ఇటీవల పంచాయతీ ఎన్నికలలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా మండలంలోని పారా పోలీసు సిబ్బంది, సచివాలయ సిబ్బంది అంకిత భావంతో పని చేశార ని తహసీల్దార్‌ జయపాల్‌ అన్నారు.  పారా పోలీస్‌, సచివాలయ సిబ్బందికి ప్ర శంసాపత్రాలను గురువారం ఆయన  జన్మభూమి కార్యాలయంలో అంద జేశారు. కార్యక్రమంలో ఎం పీడీవో సయ్యద్‌ మస్తాన్‌వలి, ఎస్‌ఐ త్యాగరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గిద్దలూరుటౌన్‌లో..

గిద్దలూరు టౌన్‌ : పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు పారా పోలీసులు కూ డా తోడ్పడ్డారని సీఐ యు.సుధాకర్‌రావు అన్నా రు. గురువారం పట్టణ శివార్లలోని చీతిరాల కల్యాణ మండపంలో  పారా పోలీసులను సన్మానించారు.  ఎన్నికల విధుల్లో పోలీసులకు పారా పోలీసులు చేదోడు వాదోడుగా ఉన్నారని కొనియాడారు.  

పొదిలిలో..

పొదిలి  :  పంచాయతీ ఎన్నికల విధు ల్లో పారా పోలీసు సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయమని ఎస్‌ఐ కె.సురేష్‌ అన్నారు. గురువారం స్థానిక మంజునాథ కల్యాణ మం డడపంలో జరిగిన ఆత్మీయసమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మే రకు 56 మంది సిబ్బందికి రూ.1000 పారితోషికం, ప్రశంసాపత్రాల తో సన్మానించారు. కార్యక్రమంలో మండలంలోని సచివాలయాల పా రా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-26T04:12:50+05:30 IST