ప్రపంచ పారా పవర్‌లిఫ్టింగ్‌లో పరమ్‌జీత్‌కు పతకం

ABN , First Publish Date - 2021-11-29T09:14:57+05:30 IST

భారత పారా అథ్లెట్‌ పరమ్‌జీత్‌ కుమార్‌ ప్రపంచ వేదికపై పతకంతో సత్తాచాటాడు.

ప్రపంచ పారా పవర్‌లిఫ్టింగ్‌లో  పరమ్‌జీత్‌కు పతకం

న్యూఢిల్లీ: భారత పారా అథ్లెట్‌ పరమ్‌జీత్‌ కుమార్‌ ప్రపంచ వేదికపై పతకంతో సత్తాచాటాడు. జార్జియాలోని బిలిసిలో జరిగిన ప్రపంచ పారా పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకం సాధించాడు. పురుషుల 49 కిలోల కేటగిరిలో పరమ్‌జీత్‌ మొత్తం 158 కిలోలు ఎత్తి మూడోస్థానంతో పతకం దక్కించుకున్నాడు. దీంతో ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత్‌ తరఫున పతకం సాధించిన తొలి పారా పవర్‌లిఫ్టర్‌గా పరమ్‌జీత్‌ చరిత్ర సృష్టించాడు. 

Updated Date - 2021-11-29T09:14:57+05:30 IST