పప్పులవారిపాలెం బాధితులకు డీఎస్పీ పరామర్శ

ABN , First Publish Date - 2022-05-24T06:42:03+05:30 IST

అమలాపు రంలోని ఒ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పి.గన్నవరం మండలం పప్పులవారిపాలేనికి చెందిన నలుగురు బాధితులను విచారించేందుకు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి సోమవారం మధ్యాహ్నం వెళ్లారు.

పప్పులవారిపాలెం బాధితులకు డీఎస్పీ పరామర్శ

విచారణ పేరుతో బాధితులను బెదిరించారని కాపు జేఏసీ నేతల ఆరోపణ

అమలాపురం, మే 23 (ఆంధ్రజ్యోతి): అమలాపు రంలోని ఒ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పి.గన్నవరం మండలం పప్పులవారిపాలేనికి చెందిన నలుగురు బాధితులను విచారించేందుకు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. బాధితులు తమ గోడు చెప్పుకుంటున్నప్పటికీ వినకుండా జాతరలో డీజేలకు అనుమతి తీసుకున్నారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ మీద రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తానంటూ బెదిరించారని కాపు జేఏసీ నాయ కులు సోమవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం వద్ద ఆరోపించారు. తక్షణం డీఎస్పీని విచారణాధికారిగా తప్పించాలని, ఎస్‌ఐ సురేంద్రపై కేసు నమోదు చేసి అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కాపులు ఉద్య మించాల్సి వస్తుందని కాపు జేఏసీ అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న బాధితులను ధన్వంతరినాయుడు కలిసి వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత నేరుగా ఎస్పీ కార్యా లయానికి వెళ్లి డీఎస్పీ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. కాపు జేఏసీ నాయకులు, బార్‌ కౌన్సిల్‌ ఏపీ వైస్‌చైర్మన్‌ రామజోగేశ్వరరావు, అమలాపురం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాకిరెడ్డి ఆదినారాయణ, టపా గోవిందరావు, బసవా ప్రభాకర్‌, కంచిపల్లి అబ్బులు, కరాటం ప్రవీణ్‌, అబ్బిరెడ్డి సురేష్‌, నల్లా పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితు లను మెట్రోకెమ్‌ అధినేత నందెపు బాలాజీ, గంధం పల్లంరాజు, బీజేపీ నాయకులు యాళ్ల దొరబాబు, మోకా వెంకటసుబ్బారావు, వాసా ప్రసాదరావు పరామర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు.  



Updated Date - 2022-05-24T06:42:03+05:30 IST