అందమైన చేప బొమ్మ!

ABN , First Publish Date - 2020-05-07T05:30:00+05:30 IST

పేపర్‌ ప్లేటు, స్కెచ్‌పెన్నులతో ఆకర్షణీయమైన చేప బొమ్మను తయారు చేయవచ్చు. అయితే పేపర్‌ ప్లేట్‌తో చేప బొమ్మ ఎలా తయారుచేయాలో...

అందమైన చేప బొమ్మ!

పేపర్‌ ప్లేటు, స్కెచ్‌పెన్నులతో ఆకర్షణీయమైన చేప బొమ్మను తయారు చేయవచ్చు. అయితే పేపర్‌ ప్లేట్‌తో చేప బొమ్మ ఎలా తయారుచేయాలో ఈ రోజు తెలుసుకుందామా!


కావలసినవి

  1. రెండు పేపర్‌ ప్లేట్లు
  2. స్కెచ్‌పెన్నులు
  3. నలుపు రంగు 
  4. పెయింట్‌ బ్రష్‌
  5. జిగురు
  6. కత్తెర
  7. కలర్‌ పేపర్స్‌

ఇలా చేయండి...

  • పేపర్‌ ప్లేట్ల కింది భాగంలో నలుపు రంగు వేసి ఆరనివ్వాలి.
  • తరువాత వాటిపై స్కెచ్‌ పెన్నుల సహాయంతో చేపల పొలుసులు గీయాలి. ఆకర్షణీయంగా కనిపించడం కోసం రంగురంగుల స్కెచ్‌లు ఉపయోగించవచ్చు.
  • కలర్‌ పేపర్స్‌పై రెక్కలు, కళ్లు, తోక ఆకారాలు గీసి కట్‌ చేయాలి.
  • వాటిని పేపర్‌ ప్లేట్‌కు బొమ్మలో చూపించిన విధంగా అతికించాలి.
  • చేప నోరు తెరిచి ఉన్నట్టుగా కనిపించడం కోసం పేపర్‌ ప్లేట్‌ను కొద్దిగా బొమ్మలో చూపించిన విధంగా కట్‌ చేయాలి.
  • మరో పేపర్‌ ప్లేట్‌ను తీసుకొని, ఇలాగే తయారుచేసి రెండింటినీ అతికించాలి.
  • అంతే... అందమైన చేప బొమ్మ రెడీ!

Updated Date - 2020-05-07T05:30:00+05:30 IST