పచ్చి బొప్పాయి రొట్టె

ABN , First Publish Date - 2021-11-26T18:57:48+05:30 IST

వరి పిండి- రెండు కప్పులు, రవ్వ - పావు కప్పు, పచ్చి బొప్పాయి తురుము- కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, క్యారెట్‌ తురుము- అర

పచ్చి బొప్పాయి రొట్టె

కావలసిన పదార్థాలు: వరి పిండి- రెండు కప్పులు, రవ్వ - పావు కప్పు, పచ్చి బొప్పాయి తురుము- కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, క్యారెట్‌ తురుము- అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు- స్పూను, కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, అల్లం పేస్టు- అర స్పూను, జీలకర్ర- స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ఓ వెడల్పాటి గిన్నెలో వరి పిండి, రవ్వ, పచ్చి బొప్పాయి తురుము, ఉల్లి, క్యారెట్‌, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్టు, జీలకర్ర, ఉప్పును వేసి బాగా కలపాలి. నీటిని చేర్చి ముద్దలా కలుపుకోవాలి. కాస్త పిండిని తీసుకుని రొట్టెలా పెనానికి మొత్తం అద్దాలి. పైన, అంచుల్లో కాస్త నూనెను వేయాలి. అలాగే కాలిస్తే పచ్చి బొప్పాయి రొట్టె సిద్ధం. మిగతా మొత్తం పిండిని ఇలాగే రొట్టెలుగా కాల్చాలి.

Updated Date - 2021-11-26T18:57:48+05:30 IST