Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ముఖంపై ముడతలు, మచ్చలు ఉన్నవారు ఇలా చేయండి!

twitter-iconwatsapp-iconfb-icon
ముఖంపై ముడతలు, మచ్చలు ఉన్నవారు ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(28-03-2022)

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడానికి, నిగారింపును పెంచుకోవడానికి బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. వయసు పైబడటం వల్ల వచ్చే ఛాయలను దూరం చేస్తుంది. ముడతలు తగ్గిపోతాయి. ముఖంలో తాజాదనం వస్తుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌ జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. బొప్పాయిలో ఉన్న ఆల్ఫా హైడ్రాక్సిల్‌ యాసిడ్స్‌ వయసు పైబడటం వల్ల వచ్చే లక్షణాలను అడ్డుకుంటాయి. కళ్ల కింద ముడతలు దూరమవుతాయి. ఇందులో ఉండే విటమిన్‌ ఇ, సి చర్మానికి పునరుజ్జీవాన్నిస్తుంది. బొప్పాయిలో సహజసిద్ధమైన బ్లీచింగ్‌ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. 


ఫేస్‌ ప్యాక్‌ తయారీ ఇలా...

అరకప్పు బొప్పాయి ముక్కలను తీసుకుని గుజ్జుగా చేసి ఒక టేబుల్‌స్పూన్‌ పాలు, తేను కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు రాసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఈ ఫేస్‌ప్యాక్‌ ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. 

మొటిమల సమస్య ఉన్న వారు బొప్పాయి, తేనె, పాలతో పాటు కొద్దిగా నిమ్మరసం, గంధం కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి పేస్టులో కోడిగుడ్డు తెల్లసొన కలిపి అప్లై చేసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. 

ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారైతే బొప్పాయి ముక్కలతో పాటు కొన్ని ఆరెంజ్‌ ముక్కలు వేసి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.