ముఖ వర్చస్సుకు బొప్పాయి ప్యాక్‌!

ABN , First Publish Date - 2020-09-10T05:30:00+05:30 IST

చర్మం నిగారింపు సంతరించుకునేలా చేయడంలో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయిని ఫేస్‌ప్యాక్‌లుగా తయారుచేసుకుని వాడితే ముఖారవిందం పెరుగుతుంది...

ముఖ వర్చస్సుకు బొప్పాయి ప్యాక్‌!

చర్మం నిగారింపు సంతరించుకునేలా చేయడంలో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయిని ఫేస్‌ప్యాక్‌లుగా తయారుచేసుకుని వాడితే ముఖారవిందం పెరుగుతుంది.


  1. కొన్ని బొప్పాయి ముక్కలను తీసుకుని గుజ్జుగా చేసి ఒకటేబుల్‌ స్పూన్‌ తేనె, పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. 20 నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత చల్లని నీటితో కడగాలి. ఇది పొడి చర్మం ఉన్న వారికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
  2. బొప్పాయి గుజ్జులో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, ఒక టేబుల్‌ స్పూన్‌ గంధం వేసి బాగా కలియబెట్టి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. పావుగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే అందం రెట్టింపవుతుంది.
  3. బొప్పాయి గుజ్జులో ముల్తానీ మట్టిని కలిపి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ముల్తానీ మట్టి ముఖంపై ఉన్న అదనపు ఆయిల్‌ను గ్రహిస్తుంది. బొప్పాయి మృదుత్వాన్ని అందిస్తుంది. ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారు, మొటిమలతో బాధపడుతున్న వారు ఈ ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  4. బొప్పాయిని గుజ్జుగా చేసుకుని అందులో రెండు టేబుల్‌  స్పూన్ల అలొవెరా జెల్‌ను కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. పావుగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ జిడ్డును కంట్రోల్‌ చేయడమే కాకుండా చర్మం పొడిబారకుండా చూస్తుంది.
  5. బొప్పాయి గుజ్జులో పది చుక్కల నిమ్మరసం వేసి బాగా కలియబెట్టి ముఖానికి ప్యాక్‌ మాదిరిగా వేసుకోవాలి. పదినిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల ముఖంపై నల్లమచ్చలు కనుమరుగైపోతాయి.

Updated Date - 2020-09-10T05:30:00+05:30 IST