పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం

ABN , First Publish Date - 2022-08-19T05:27:35+05:30 IST

సర్దార్‌ పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర మహిళా కమిషనర్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు.

పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం
సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి సందర్భంగా నర్సాపూర్‌లో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి 

పలు మండలాల్లో సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి

నర్సాపూర్‌, ఆగస్టు 18: సర్దార్‌ పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర మహిళా కమిషనర్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సర్దార్‌ పాపన్నగౌడ్‌ 372 జయంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ పాపన్నగౌడ్‌ ప్రతిఒక్కరికి ఆదర్శనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనసూయఅశోక్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్‌స్టేషన్‌ నుంచి సర్దార్‌పాపన్నగౌడ్‌ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

మెదక్‌ అర్బన్‌: బహుజన రాజ్యాధికార యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సర్వాయి పాపన్న 372 జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రేణుకాఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రమేష్‌, జిల్లా బీసీ సంక్షేమాధికారి కేశురాం పాల్గొన్నారు. 

చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్నగౌడ్‌ 372 జయంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు తహసీల్దార్‌ రాజేశ్వర్‌, ఎస్‌ఐ సుభా్‌షగౌడ్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. 

అల్లాదుర్గం: అల్లాదుర్గంలోని పెద్దాపూర్‌లో జాగృతి జిల్లా కన్వీనర్‌ క్రిష్ణగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్నగౌడ్‌ జయంతిలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నర్సింహులు, సొసైటీ చైర్మన్‌ దుర్గారెడ్డి పాల్గొన్నారు. 

హవేళీఘణపూర్‌: హవేళీఘణపూర్‌ మండల పరిధిలోని రాగిపేటలో పాపన్న జయంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. 

రామాయంపేట: రామాయంపేట పట్టణంలోని రేణుకాఎల్లమ్మ ఆలయం వద్ద గురువారం పాపన్నగౌడ్‌ జయంతిని నిర్వహించారు. మొదటి మున్సిపల్‌ చర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాసు యాదగిరి ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేశారు. అనంతరం ఎక్సైజ్‌ సీఐ జయసుధ, గౌడ సంఘం నాయకులు నివాళులర్పించారు. 

శివ్వంపేట: పాపన్నగౌడ్‌ జయంతిని పురస్కరించుకుని శివ్వంపేటలో గౌడ సంఘం నాయకులు పెద్దఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌ పాల్గొన్నారు. 

కొల్చారం: కొల్చారం మండల పరిధిలోని చిన్నఘనపూర్‌లో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గౌడ సంఘం నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో నర్సాపూర్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

తూప్రాన్‌: తూప్రాన్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.  

తూప్రాన్‌రూరల్‌: తూప్రాన్‌ మండలంలోని వెంకటాయపల్లిలో పాపన్నగౌడ్‌ జయంతి సందర్భంగా గౌడ కులస్తులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి క్షీరాభిషేకం చేశారు. 

సంగారెడ్డి జిల్లాలో

పుల్‌కల్‌, ఆగస్టు 18: ఉమ్మడి పుల్కల్‌ మండలంలో సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని గురువారం నిర్వహించారు. పుల్కల్‌, చౌటకూర్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మండల కేంద్రమైన చౌటకూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన జయంతిలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ పాల్గొని పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కొన్నిరోజులుగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏల వద్దకు వెళ్లి మాట్లాడారు. 

వట్‌పల్లి: బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి సర్వాయి పాపన్న అని ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రమైన వట్‌పల్లిలో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.  

నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌ అతిధి గృహం ఆవరణలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో, నిజాంపేట, ర్యాకల్‌, తుర్కపల్లిలలో పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.  

హత్నూర: హత్నూర మండలంలోని దేవులపల్లి, దౌల్తాబాద్‌ గ్రామాల్లో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలవేసి స్వీట్లు పంచి పెట్టారు. 

గుమ్మడిదల: గుమ్మడిదల మండలంలోని బొంతపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 372 జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

సంగారెడ్డి రూరల్‌: సంగారెడ్డిలోని ముదిరాజ్‌ సంఘం జిల్లా కార్యాలయంలో సర్వార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 372 జయంతి నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు పూలమాలవేసి నివాళులర్పించారు. పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్యం కోసం పోరాడుదామని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆశన్నగౌడ్‌, రమే్‌షగౌడ్‌ అన్నారు. పాపన్నగౌడ్‌ జయంతి సందర్భంగా గురువారం సంగారెడ్డిలోని ఐబీ నుంచి కొత్త బస్టాండ్‌ మీదుగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా బీఎస్పీ జిల్లా కార్యాలయంలో సర్దార్‌ పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సర్వాయి పాపన్నగౌడ్‌ 372వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రాములు పూలమాలవేసి నివాళులర్పించారు. 



Updated Date - 2022-08-19T05:27:35+05:30 IST