AP News: కడప జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాపాగ్నినది

ABN , First Publish Date - 2022-08-04T16:03:35+05:30 IST

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరండంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు.

AP News: కడప జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాపాగ్నినది

కడప: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టు(Veligallu project)కు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరండంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. దీంతో పాపాగ్నినది (Papagni river) ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు విన్‌పల్లె మండలంలో  ఓబులరెడ్డిపల్లె వాగు (Obulareddypalle vagu) పొంగిపొర్లుతోంది. వాగు ఉధృతి అధికంగా ఉండటంతో మునీంద్ర, యర్రన్న అనే ఇద్దరు గొర్రెలకాపరులు వాగులో చిక్కుకుపోయారు. వాగులో చెట్టును పట్టుకొని గొర్రెల కాపరులు సాయం కోసం ఎదరు చూస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే స్ధానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని గొర్రెలకాపరులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-08-04T16:03:35+05:30 IST