పాణ్యం సిమెంట్స్‌ దివాలా ప్రక్రియ షురూ

ABN , First Publish Date - 2020-05-29T06:05:45+05:30 IST

పాణ్యం సిమెంట్స్‌ అండ్‌ మినరల్‌ లిమిటెడ్‌పై కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అమరావతి బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ...

పాణ్యం సిమెంట్స్‌ దివాలా ప్రక్రియ షురూ

  • ఐఆర్‌పీ నియామకం

పాణ్యం సిమెంట్స్‌ అండ్‌ మినరల్‌ లిమిటెడ్‌పై కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అమరావతి బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఐబీసీలోని సెక్షన్‌ 7 కింద ఐడీబీఐ ట్రస్ట్రీషిప్‌ సర్వీసెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. డిబెంచర్ల కాలపరిమితి ముగిసిన తర్వాత నగదును తిరిగి చెల్లించడంలో విఫలం కావడానికి సంబంధించి పాణ్యం సిమెంట్‌పై ఐడీబీఐ ట్రస్ట్‌షిప్‌ సర్వీసెస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై బృగేశ్‌ అమిన్‌ను మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఐఆర్‌పీ)గా ఎన్‌సీఎల్‌టీ నియమించింది.  


Updated Date - 2020-05-29T06:05:45+05:30 IST