Abn logo
Apr 23 2021 @ 00:47AM

ఈ ఏడాదైనా పంట బీమా అందేనా..?


రైతుల్లో ఆందోళన

గతంలో రూ.30 కోట్లకు గాను

రూ.35లక్షలు విడుదల

కొంప ముంచిన కందుల 

కొనుగోలు కేంద్రాలు 

నిర్వాహకులు వైఫల్యంతో నష్టం

పొదిలి రూరల్‌, ఏప్రిల్‌ 22: పొదిలి మండలంలో కంది రైతులకు కొండంత బీమా రావాల్సి ఉన్నా గో రంత విదిల్చి చేతులు దులుపుకున్నారు. మా ర్కుఫెడ్‌, వ్యవసాయశాఖ, ధాన్యం కొను గోలు కేంద్రాలు యజ మానుల అ నాలోచిన నిర్ణయాల వల్ల రైతుల కు పెద్ద శాపంగా మారి కోలుకో లేని దెబ్బతీస్తున్నాయి. ఆరుగా లం పండించిన పంటలను దోచు కునే దళారుల నుంచి రైతులకు న్యాయం చేయాలని సంకల్పంతో  ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఏర్పా టు చేసింది.  ఇక్కడే అసలు దోపిడీ మొ దలైంది. నాయకులకు పర్సంటేజీలు ముట్టజెప్పి దాన్యం కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయించు కొన్న కొంత మంది దళారులు ఇతర రా ష్ట్రాలు, జిల్లా నుంచి ధాన్యం తక్కువ ధరకు కొను గోలు చేసి ప్రభు త్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో స్థానిక మండలం లోని రైతుల పేరు మీద అమ్ముతు న్నారు. ఈతరు ణంలో 2018, 2019 సంవత్సరాల్లో 14,327 మంది రైతులు పంటను సాగు చేశారు. ప్రకృ తి వైపరీత్యాల నుంచి నష్టపోకుండా రైతులు 11723 హెక్టార్లకు పం టల బీమా చేశారు. కాని మండలంలో 14327 మంది రైతులకుగాను 160 మంది మిర్చి రైతు లకు తప్ప మిగిలిన పంటలు సాగు చేసిన రైతులకు బీమా పరి హారం ఒక్క రూపాయి కూడా విడుదల కా లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. 

బీమా రాకపోవడానికి 

కారణాలు 

ప్రకృతి వైపరీత్యాలు సంభవిం చిన ప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు నష్ట పోకుండా ఆయా మండలాల్లో పంటల అంచ నాలు తయారు చేస్తారు. 2017-18లో ఖరీఫ్‌ 10800 హె క్టార్లు, రబీలో 2077 హె క్టార్లు, 2018-19 ఖరీఫ్‌ 12167 హెక్టార్లు, రబీలో 2154 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. దానికి అధికారులు 2017-18-19 సంవత్స రాలకు వ్యవసాయ అధికారులు ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అంచనాలు వేసి అప్పట్లో ప్రభు త్వానికి  నివేదికలు పంపారు. ఈత రుణంలో కందుల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అత్యాశతో పక్క రాష్ట్ట్రలు, జిల్లాల నుంచి తక్కువ ధర కు  కందులు కొనుగోలు చేసి ఆయా కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్‌ అధికారుల అండదండలతో ఇక్కడి రైతుల పేర్ల మీద ప్రభుత్వానికి అమ్మేశారు. అయితే మార్క్‌ ఫెడ్‌ అధికా రులు ఇచ్చిన చొరవతో కొనుగోలు కేంద్రాల నిర్వా హకులు రైతులకు మాయమాటలు చెప్పి వారి పట్టాదార పాసుపుస్తకాలపై వ్యవసాయాధికారుల ని వేదికల ప్రకారం 2 క్వింటాళ్ల బదులు 6 క్వింటాళ్ల కం దులు అమ్మకాలు చేయడంతో ఈ బీమా రైతులకు వ ర్తించలేదని బాధిత రైతులు వాపోతున్నారు. అందు వల్ల పొదిలి మండలంలో కరువు లేదు.. అన్ని పంట లు దిగుబడి బాగావచ్చిదని నిర్ణయించిన బీమా కం పెనీ మండలానికి రావాల్సిన రూ.30 కోట్ల ఇన్సూ రెన్స్‌కు గాను రూ.35 లక్షలు విడుదల చేసిందని రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మార్క్‌ ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోలు వివరాలను సేకరించి అధిక దిగుబడి వచ్చినట్లు తేలడంతో ఈ ప్రాంత రైతులు సుమారు రూ.30 కోట్ల మేర నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంది పంట 2018-19 సంవత్సరంలో మంచి దిగుబడి వచ్చిందని, పంటలు బాగానే పండినందున బీమా ఎగవేతకు అడ్డంకి తొలగిపోయింది. ఏదిఏమైనా మార్క్‌ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై రైతులను నిలువునా దోసేశారని పొదిలి వ్యవసాయ కార్యాలయం దగ్గర ఆందోళనచేసిన సంఘటనలు ఉన్నాయి.  అధికారుల నిర్లక్ష్యం, తప్పుడు లెక్కలు ఇవ్వడం వల్లే నష్టపోయామని నినాదాలు చేశారు. ఇ ప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి 2018-19 సంవత్సరంలో బీమా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కో రుతున్నారు. 

అధికారుల మాయాజాలంతో నష్టం

అధికారుల మాయాజాలం వల్లే బీమా కో ల్పోయాం. ప్రభుత్వానికి తక్కువ దిగుబడి చూ పించి అమ్మకం ఎక్కువ చూపించడం వల్ల కరవు ప్రాంతం కాదని బీమా కంపెనీ వారు నిజమైన రైతులకు పరిహారం దక్కకుండా చేశారు.

- గుంటూరు సుబ్బయ్య, రైతు


కందుల కొనుగోలు కేంద్రాలే శాపం

పొదిలి మండలంలో కందుల కొనుగోలు కేం ద్రాలే మాకు శాపంగా మారింది. అధికారులకు రూ.లక్షల ఆశచూపి కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న యజమానులు, అధికారులు కుమ్మక్కై అధిక దిగుబడిని చూపించారు. అందు వల్లనే పొదిలి మండల రైతులకు బీమా రాలేదు.    

- పుట్టా కొండలు, రామాపురం

ఉన్నతాధికారులకు 

సమాచారం అందించాం

క్రాప్‌ కటింగ్‌ ఎక్స్‌ఫర్‌మేషన్‌ ద్వారా 5 సంవ త్సరాల సరాసరి దిగుబడి తీసుకుని ప్రతి సంవత్స రంలో రావాల్సిన దిగుబడి కంటే తక్కువ వచ్చిన ఏరియాలను తీసుకుని ఇన్సూరెన్స్‌ కేటాయిస్తారు. రావాల్సిన బీమాపై ఉన్నత అధికారులకు కూడా సమాచారం అందించాం. 

- అర్జున్‌నాయక్‌, ఏడీఏ

Advertisement