రఘుపతికి పనోరమా గోల్డెన్‌ బుక్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-05-18T08:08:38+05:30 IST

తిరుపతికి చెందిన కేవీ రఘుపతికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన పనోరమా గోల్డెన్‌బుక్‌ అవార్డు లభించింది.

రఘుపతికి పనోరమా గోల్డెన్‌ బుక్‌ అవార్డు

తిరుపతి(విద్య), మే 17: తమిళనాడులోని తిరువారూర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయిన తిరుపతికి చెందిన కేవీ రఘుపతికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన పనోరమా గోల్డెన్‌బుక్‌ అవార్డు లభించింది. బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో రాబర్ట్‌ అలెగ్జాండ్రే పరిచయంతో తాను రచించిన ది మౌంటైన్‌ ఈజ్‌ కాలింగ్‌ పుస్తకం 2019లో వైట్‌ ఫాల్కన్‌ పబ్లిషింగ్‌ ద్వారా ప్రచురితమైంది. ఈపుస్తకాన్ని రైటర్స్‌ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ వారు 2022కి ఇంటర్నేషనల్‌ పనోరమా గోల్డెన్‌ బుక్‌ అవార్డుకి ఎంపిక చేశారని రఘుపతి పేర్కొన్నారు. కాగా.. ఈయన 1980నుంచి ఆంగ్లంలో రచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు 12 కవితా, రెండు కథా సంకలనాలతోపాటు రెండు నవలలు, ఎనిమిది విమర్శనాత్మక పుస్తకాలను రచించారు. నాలుగు దశాబ్దాలుగా పతంజలి యోగా సాధకుడిగా ఉన్నారు. యోగా, ఆధ్యాత్మికతలపై వివిధ ప్రింట్‌, ఆన్‌లైన్‌ జర్నల్స్‌లో ఐదు పుస్తకాలు, 60కిపైగా ఆలోచనలను రేకెత్తించే రాడికల్‌ కథనాలు ప్రచురించారు. తన యోగా ఛానల్‌లో యోగా, ఆధ్మాత్మికతలపై 200వరకు ప్రసంగాలు చేశారు. అనేక అవార్డులతోపాటు 2018లో న్యూడిల్లీలోని ఆయుష్‌ ద్వారా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2022-05-18T08:08:38+05:30 IST