రూ.200 పెట్టుబడి పెడితే.. రూ.8.80 లక్షల లాభం.. ఒక్కరోజులోనే ఈ మహిళ జీవితం ఎలా మారిపోయిందంటే..

ABN , First Publish Date - 2022-05-25T20:31:47+05:30 IST

ఆమె రూ.200 పెట్టుబడి పెట్టి ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుంది.. ఆ భూమిలో వజ్రాల కోసం తవ్వకాలు జరిపింది..

రూ.200 పెట్టుబడి పెడితే.. రూ.8.80 లక్షల లాభం.. ఒక్కరోజులోనే ఈ మహిళ జీవితం ఎలా మారిపోయిందంటే..

ఆమె రూ.200 పెట్టుబడి పెట్టి ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుంది.. ఆ భూమిలో వజ్రాల కోసం తవ్వకాలు జరిపింది.. మూడు నెలల ఆమె కష్టం ఫలించి ఆమెకు 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది.. దాని విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. దీంతో ఒక్కసారిగా ఆమె దశ తిరిగిపోయింది.. మధ్యప్రదేశ్‌లోని పన్నాకు చెందిన ఛమేలీ బాయి కృష్ణ కల్యాణ్‌పూర్ బెల్ట్‌లో ఉన్న 4*4 మీటర్ల ప్రభుత్వ భూమిని ఫిబ్రవరిలో మైనింగ్ కోసం లీజుకు తీసుకుంది. 

ఇది కూడా చదవండి..

కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు ఫ్రెండ్స్.. ‘బీటెక్ ఛాయ్’ పేరుతో టీ స్టాల్.. ఇప్పుడు వీళ్ల సంపాదనెంతో తెలిస్తే..


భర్తతో కలిసి ఆ భూమిలో మూడు నెలల పాటు తవ్వకాలు జరిపింది. మంగళవారం ఆమె అదృష్టం ఫలించింది. 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది. వెంటనే భర్తతో పాటు వెళ్లి పన్నాలో ఉన్న డైమండ్స్ ఆఫీస్‌లో డిపాజిట్ చేసింది. అది బ్రైట్ డైమండ్ కావడంతో వేలంలో 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలా వచ్చిన మొత్తంలో ఒక శాతం ట్యాక్స్, 12 శాతం గవర్న్‌మెంట్ రాయల్టీ పోను ఛమేలీ బాయికి రూ.8 లక్షలు రావొచ్చని చెబుతున్నారు. తమ కుటుంబం పదేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటుందని, డబ్బులు వస్తే చిన్న ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నామని ఛమేలీ బాయి తెలిపింది.  

Updated Date - 2022-05-25T20:31:47+05:30 IST