Abn logo
Jan 25 2021 @ 00:57AM

చిరుత దాడితో భయాందోళన

భైంసా రూరల్‌, జనవరి 24: మండలంలోని పాంగ్రి గ్రామ సమీపంలో ఆదివారం పంట చేనులో జింకపై చిరుత దాడి చేయడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చనిపోయిన జింక మృతదేహంపై గాయాలు కనిపించడంతదో చిరుత దాడి చేసిందని గ్రామస్థులు ఆందోళలనకు గురయ్యారు. వెంటనే ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపారు. గ్రామ సమీపంలో ఈ చిరుతపులి జింకపై దాడి చేసి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానించారు. కొన్ని రోజు ల క్రితం అడవి పందిపై కూడా దాడి జరిగిందని వారన్నారు. అటవీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఇర్ఫాన్‌ ఉద్దీన్‌ జింకపై దాడి చేసి చేసిన ప్రాంతానికి చేరుకొని పంచనామా నిర్వహించి ఏ జంతువు దాడి చేసిందో తర్వాత వెల్లడిస్తామని ఆయన అన్నారు. పశువైద్యాధికారి విఠల్‌చే జింక మృత దేహనికి పంచనామా నిర్వహించామ ని ఆయన అన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారికి పం పనున్నట్లు ఆయన అన్నారు. అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ తాము భయాందోళనకు గురవుతున్నార ని, అలాగే పంట చేలకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement
Advertisement