Abn logo

పనీర్‌ లడ్డు

కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు - 2 లీటర్లు, నిమ్మరసం- 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - అర టీ స్పూను, పాలు - పావుకప్పు (విడిగా)-  క్రీమ్‌-పావు కప్పు, మిల్క్‌పౌడర్‌-ముప్పావు కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌-ముప్పావు కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను. 

తయారుచేసే విధానం: లోతైన పాత్రలో పాలను మరిగించి నిమ్మరసం కలపాలి. పాలు పూర్తిగా విరిగిన తర్వాత వడకట్టి పక్కనుంచాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి పాలు పోయాలి. ఆ తర్వాత క్రీమ్‌ వేసి బాగా కలపాలి. ఆనక మిల్క్‌పౌడర్‌ వేసి ఉండలు చుట్టకుండా తిప్పుతూ, కోవా చిక్కబడ్డాక చిదిమిన పనీర్‌ వేసి చిన్నమంటపై 5 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి మీడియం మంటలో అడుగంటకుండా కలపాలి. పూర్తిగా చిక్కబడ్డాక యాలకుల పొడి కలిపి దించాలి. గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి.

కొబ్బరి లడ్డుఇన్‌స్టంట్‌ జిలేబీస్వీట్‌ పనియారంక్యారెట్‌ బొబ్బట్లురబ్డీకలాకంద్‌ఖీర్‌బాసుందిచాక్లెట్‌ మోదకంకొబ్బరి సేమియా పాయసం
Advertisement