పనీర్‌ అనరద్న కబాబ్‌

ABN , First Publish Date - 2021-02-22T23:24:18+05:30 IST

కబాబ్స్‌ అనగానే నాన్‌వెజ్‌ ఘుమఘుమలు గుర్తొస్తాయి. కానీ వెజ్‌ కబాబ్‌లను ఒకసారి తింటే వాటి రుచికి ఫిదా అవకుండా ఉండలేరు. గ్రీన్‌పీస్‌ కబాబ్‌, దహీ కబాబ్‌, సాబుదానా కబాబ్‌, పనీర్‌ కబాబ్‌... ఆ కోవకు చెందినవే. ఈసారి వెజ్‌ కబాబ్స్‌తో రుచుల వేడుక చేసుకోండి

పనీర్‌ అనరద్న కబాబ్‌

వావ్‌...వెజ్‌ కబాబ్స్‌!

కబాబ్స్‌ అనగానే నాన్‌వెజ్‌ ఘుమఘుమలు గుర్తొస్తాయి. కానీ వెజ్‌ కబాబ్‌లను ఒకసారి తింటే వాటి రుచికి ఫిదా అవకుండా ఉండలేరు.  గ్రీన్‌పీస్‌ కబాబ్‌, దహీ కబాబ్‌, సాబుదానా కబాబ్‌, పనీర్‌ కబాబ్‌... ఆ కోవకు చెందినవే. ఈసారి వెజ్‌ కబాబ్స్‌తో రుచుల వేడుక చేసుకోండి మరి.


కావలసినవి: పనీర్‌ - 500గ్రాములు, క్యాప్సికం - రెండు, టొమాటో - రెండు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, చాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, హంగ్‌ యోగర్ట్‌ - అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, కశ్మీరీ కారం - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, గరంమసాలా - అర టీస్పూన్‌, అనరద్న పౌడర్‌ - రెండు టీస్పూన్లు, క్రీమ్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం: పనీర్‌ను అంగుళం ఉండేలా క్యూబ్స్‌గా కట్‌ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో హంగ్‌ యోగర్ట్‌, అల్లం వెల్లుల్లి పేస్టు, కశ్మీరీ కారం, పసుపు, అనరద్న పొడి, గరంమసాలా, క్రీమ్‌, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి పావుగంట పాటు పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి పనీర్‌ క్యూబ్స్‌ గోధుమ రంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి. తరువాత అదే పాన్‌లో క్యాప్సికం, టొమాటో ముక్కలను వేగించుకోవాలి. చువ్వలకు పనీర్‌ ముక్కలు, మధ్యలో క్యాప్పికం, టొమాటో ముక్కలు గుచ్చాలి. ఈ కబాబ్స్‌ను చాట్‌ మసాలా చల్లుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-02-22T23:24:18+05:30 IST