బ్రాహ్మణులకు మన తిండి వద్దు, డబ్బులు కావాలి: బిహార్ మాజీ సీఎం

ABN , First Publish Date - 2021-12-20T00:37:52+05:30 IST

పేద వర్గాల్లో ఈ మధ్య భక్తిభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఇది ఇంతగా లేకుండేది. ఇప్పుడు కొత్తగా సత్యనారాయణను కూడా కొలుస్తున్నారు. ఈ పేరు ఇంతకు ముందు మనకు తెలియనే తెలియదు..

బ్రాహ్మణులకు మన తిండి వద్దు, డబ్బులు కావాలి: బిహార్ మాజీ సీఎం

పాట్నా: సామాజికంగా వెనుకబడిన ప్రజల నుంచి బ్రాహ్మణులకు డబ్బులు మాత్రమే కావాలని, తిండి తినమంటే వాళ్లు తినరని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవాం మోర్చా అధినేత జితన్‌రాం మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాష్ట్ర రాజధాని పాట్నాలో భుయ్యాన్-ముసామర్ కమ్యూనిటీ వారు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘పేద వర్గాల్లో ఈ మధ్య భక్తిభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఇది ఇంతగా లేకుండేది. ఇప్పుడు కొత్తగా సత్యనారాయణను కూడా కొలుస్తున్నారు. ఈ పేరు ఇంతకు ముందు మనకు తెలియనే తెలియదు. కానీ మన ప్రజలు కూడా సత్యనారాయణ పూజ చేస్తున్నారు. ఈ పూజ పేరుతో కొంత మంది పండిట్లు వచ్చి చందాలు అడుగుతారు. తినమంటే తినరు కానీ నగదు మాత్రం కావాలని అడుగుతారు’’ అని జితన్ రాం మాంఝీ అన్నారు. అయితే పండిట్లను పలుకుతూ వారిని ‘హరామీ’ అని పదాన్ని జతచేశారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా, తాను హరామీ అని దళితులను ఉద్దేశించి అన్నానని, తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని మాంఝీ కోరారు.

Updated Date - 2021-12-20T00:37:52+05:30 IST