మంత్రి మేకపాటిపై పంచుమర్తి అనురాధ విమర్శలు

ABN , First Publish Date - 2020-02-19T21:42:56+05:30 IST

గుంటూరు జిల్లా: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శల వర్షం కురిపించారు.

మంత్రి మేకపాటిపై పంచుమర్తి అనురాధ విమర్శలు

గుంటూరు జిల్లా: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శల వర్షం కురిపించారు. ఏపీ నుంచి కంపెనీలనన్నింటిని వెళ్లగొట్టినందుకు ఆయనను సీఎం జగన్ సత్కరించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామంటున్న ప్రభుత్వం... ఏ కంపెనీలకు అనుబంధంగా చేస్తున్నారో చెప్పాలన్నారు. కియా అనుబంధ సంస్థలు, లులు, డేటా సెంటర్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్ సంస్థలను మేకపాటి వెళ్లగొట్టారని ఆమె విమర్శించారు. అంతర్జాతీయ సంస్థలను వెళ్లగొట్టినందుకు.. మేకపాటికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌శాఖ అప్పగించారా? అని అనురాధ ఎద్దేవా చేశారు.


చంద్రబాబు హయాంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. రాష్ట్రానికి వచ్చాయని, 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయని పంచుమర్తి అనురాధ అన్నారు. చంద్రబాబు కృషిని ఐరాస సహా అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయన్నారు. విశాఖలో మూడు భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ఘనత టీడీపీదేనని అనురాధ అన్నారు. 

Updated Date - 2020-02-19T21:42:56+05:30 IST