Abn logo
May 23 2020 @ 12:06PM

వైసీపీ ఏడాది పాలనంతా దాడులు, దౌర్జన్యాలే: పంచుమర్తి

అమరావతి: వైసీపీ ఏడాది పాలనంతా దాడులు, దౌర్జన్యాలతోనే గడిచిపోయిందని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. హైకోర్టు 67 సార్లు మొట్టికాయలు వేసినా జగన్ ప్రభుత్వంలో చలనం లేదని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో దళితులను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను దారుణంగా హింసించారన్నారు. కుచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయమన్నందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌ను వేధించారని గుర్తుచేశారు. ఇక ఆత్మకూరులోనైతే వందల దళిత కుటుంబాలను తరిమేశారని తెలిపారు. ఇన్ని దాడులు జరుగుతున్నా దళిత హోంమంత్రి స్పందించరేం? అని అడిగారు. న్యాయవ్యవస్థ వల్లే రాష్ట్రంలో దళితులు రక్షింపబడుతున్నారని చెప్పుకొచ్చారు. జగన్ తీరు వల్ల చీఫ్ సెక్రటరీ, పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. 


Advertisement
Advertisement
Advertisement