అమరావతి: ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ కేసు దుర్మార్గమని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఏం నేరం చేశారని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? అని ఆమె ప్రశ్నించారు. జగన్ చేతిలో సీఐడీ కీలు బొమ్మగా మారిందన్నారు. రాష్ట్రంలో సాక్షి తప్ప మరో మీడియా ఉండకూడదన్నది జగన్‌రెడ్డి ఆలోచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ఎత్తిచూపి, జనాన్ని చైతన్యం చేస్తున్నందుకే కక్షగట్టారని పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని జగన్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో ఎత్తుగడ వేయడం జగన్ రెడ్డికి అలవాటేనన్నారు.