NRI duped: ఎన్నారైని నిండా ముంచేసిన లాయర్.. ఆశపెట్టి.. ముగ్గులోకి దించి.. చివరకు..

ABN , First Publish Date - 2022-07-29T02:43:02+05:30 IST

లాయర్ చేతిలో మోసపోయిన తనకు న్యాయం చేయాలంటూ బ్రిటన్‌లో ఉంటున్న ఓ ఎన్నారై తాజాగా పంజాబ్ పోలీసులను ఆశ్రయించారు.

NRI duped: ఎన్నారైని నిండా ముంచేసిన లాయర్.. ఆశపెట్టి.. ముగ్గులోకి దించి.. చివరకు..

ఎన్నారై డెస్క్: లాయర్ చేతిలో మోసపోయిన తనకు న్యాయం చేయాలంటూ బ్రిటన్‌లో ఉంటున్న ఓ ఎన్నారై తాజాగా పంజాబ్  పోలీసులను ఆశ్రయించారు. లాభాల ఆశ చూపి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పేరిట ముగ్గులోకి దించి దబ్బుదండుకున్నాడని లాయర్‌పై ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జీఎస్ సంఘేరా అనే ఎన్నారై బ్రిటన్‌లో నివసిస్తుంటారు. ఆయనకు 2011లో పంకజ్ భరద్వాజ్ అనే లాయర్‌తో పరిచయమైంది. తాను పెట్టుబడుల సలహాదారు అని కూడా పంకజ్ తనతో చెప్పినట్టు సంఘేరా తెలిపారు.  పాంచ్‌కుల(Panchkula) నగరంలో ఆయన కార్యాలయం ఉండేదన్నారు.  అప్పట్లో..పంకజ్ ఓ నకిలీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రజలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తుండేవారని తన ఫిర్యాదులో జీఎస్ సంఘేరా పేర్కొన్నారు. కేవలం కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు..షిమ్లాలో ఉందంటూ అసత్యాలు చెప్పే వారన్నారు. తన తరఫున ఆ ప్రాజెక్టులో పెట్టుబుడులు పెడతానని పంకజ్ అనడంతో తాను అంగీకరించినట్టు సంఘేరా తెలిపారు. మంచి ఆదాయం వస్తుందంటూ వరుసగా నాలుగేళ్ల పాటు తన నుంచి డబ్బుతీసుకున్నారన్నారు. 


తాను ఫోన్ చేసిన ప్రతిసారి.. ప్రాజెక్టులో ఆశించిన రీతిలోనే ముందుకు వెళుతోందని, త్వరలోనే పూర్తవుతుందని పంకజ్ హామీ ఇస్తుండేవారని సంఘేరా తెలిపారు. ఓ రోజు అకస్మాత్తుగా పంకజ్ సైలెంటైపోయారని చెప్పారు. ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చేవారు కాదన్నారు. దీంతో.. అనుమానమొచ్చి తాను షిమ్లాలోని రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. పంకజ్ చెప్పిన ప్రాజెక్టు అంతా బూటకమని తేలిందన్నారు. చివరకు ఆ ఎన్నారై సెక్టర్-11 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నారై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-07-29T02:43:02+05:30 IST